Namitha : సొంతం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమిత.. తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. జెమిని, సింహా తదితర సినిమాల్లో నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అయితే.. అందాల తార నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అభిమానులకు శుభవార్త చెబుతున్నామంటూ.. కవల పిల్లలతో ఉన్న దృశ్యాలను దంపతులు షేర్ చేశారు. ఇద్దరూ మగపిల్లలేనని, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని తన భర్తతో కలిసి ఆ కవలలిద్దరినీ తీసుకొని ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంది నమిత. ఆలయ ప్రాంగణంలోనే వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు మగ శిశువులకు నమిత జన్మనిచ్చింది. ఆసుపత్రి యాజమాన్యానికి, గర్భం దాల్చిన నాటి నుంచి వైద్య చికిత్స, సలహాలు, సూచనలు అందించిన డాక్టర్లు భువనేశ్వరి, ఈశ్వర్, వెల్లు మురుగన్, డాక్టర్ నరేశ్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇక ముందు కూడా అభిమానుల ఆశీస్సులు తమకు ఉండాలని ఆమె కోరింది. నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నవంబర్ 2017లో నమిత వివాహం చేసుకుంది. తిరుపతిలోని ఇస్కాన్ లోటస్ టెంపుల్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీవీ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వారి వివాహం జరిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…