Highway Movie Review : ఆనంద్ దేవ‌ర‌కొండ హైవే మూవీ రివ్యూ.. ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్‌.. సినిమా ఎలా ఉందంటే..

Highway Movie Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన‌ మూవీ హైవే. టాలీవుడ్ లో మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌, పుష్పక విమానంలాంటి మూవీస్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్‌.. ఇప్పుడో క్రైమ్‌ థ్రిల్లర్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్‌ చేయడానికి వచ్చాడు. ఆనంద్ చేసిన సినిమా అంటే క‌చ్చితంగా ఏదో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని భావిస్తాము. అందులోనూ డైరక్టర్ కేవీ గుహన్.. గతంలో కళ్యాణ్ రామ్ కు 118 హిట్ ఇచ్చాడు. దీంతో క‌చ్చితంగా సినిమాలో కొత్తదనం ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మన అంచనాలకు తగ్గట్లే సినిమా కొత్తగా ఉందా.. అసలు కథేంటి.. సినిమా వర్కవుట్ అవుతుందా.. వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ..

డీ అలియాస్ దాస్ (అభిషేక్ బెనర్జీ) హైదరాబాద్ నగరంలో మహిళలపై 5 వరుస హత్యలకు పాల్పడిన సైకోపాత్ కిల్లర్. ఈ వరుస హత్యల వెనుక హంతకుడి అసలు ఉద్దేశం అర్థం కాకపోవడం పోలీసులకు ఈ కేస్ పెద్ద మిస్టరీగా మారుతుంది. ఈ హత్యలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను ఆశా భరత్ (సయామీ ఖేర్) చేపడుతుంది. మరో వైపు, వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్‌ అయిన విష్ణు (ఆనంద్ దేవరకొండ) తన పని మీద బెంగుళూరుకు బయలుదేరుతాడు.

Highway Movie Review

తులసి (మానస రాధాకృష్ణన్) ఒక పౌల్ట్రీ ఫామ్‌లో తన ఒంటరి తల్లితో కలిసి పనిచేస్తూ జీవిస్తుంటుంది. తన యజమాని వేధింపుపులు భరించలేక పారిపోయిన తులసి యాదృచ్ఛికంగా విష్ణుని కలుస్తుంది. మరోపక్క పోలీసు డిపార్ట్‌మెంట్ సోదాలు ముమ్మరం చేయడంతో దాస్ కూడా నగరం విడిచిపెడ‌తాడు. ఇక సైకోపాత్‌ని పోలీసులు పట్టుకున్నారా ? విష్ణు, తులసికి ఆ సైకోపాత్‌ ఎదురు పడ‌తాడా ? విష్ణు, తులసి, దాస్‌ ను ఎలా అడ్డగించారు ? సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడండి.

విశ్లేషణ..

ఈ మూవీ నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది. మొత్తం మీద ఈ హైవే చిత్రం ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. సినిమా సాగినంతసేపు సస్పెన్స్ తో కూడిన ఆతుర‌త‌ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఈ చిత్రంలోని అన్ని క్యారెక్టర్స్ తమ పాత్రల‌ను మంచిగా పోషించారు. ఈ సినిమాలో చెప్పుకోవలసింది నెగెటివ్ పాత్ర పోషించిన అభిషేక్ బెనర్జీ గురించి. బెనర్జీ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన పాత్రలకి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తెలుగులో ఆయన చేసిన పాత్ర కూడా అంతే గుర్తింపు తీసుకు వచ్చేలాగా ఉంది. ఆనంద్ దేవరకొండ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ పాత్ర కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.

స్టోరీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్ల‌స్ పాయింట్స్ కాగా.. సినిమా ప్రారంభంలో పాట అతికించినట్లుగా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉన్న కొన్ని సీన్స్, మిస్సయిన లాజిక్, పూర్ ఎడిటింగ్ వంటివి మైన‌స్ పాయింట్స్ అని చెప్ప‌వ‌చ్చు. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ హైవే మూవీ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. దీన్ని ఒక‌సారి చూడ‌వ‌చ్చు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM