Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ దేవరకొండకు యూత్‌లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే త్వరలో లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారనున్నాడు. విజయ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రముఖ కూల్‌డ్రింక్స్ కంపెనీ థమ్స్ అప్ తమ ప్రచారకర్తగా విజయ్ ను నియమించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్‌తో థమ్స్ అప్ యాడ్ తీసింది. అందులో విజయ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

ఒక భారీ షిప్‌లో విజయ్ దేవరకొండని తాళ్లతో కుర్చీకి కట్టేసి ఉంటారు. అనుకోకుండా ఫైట్ స్టార్ట్ చేసిన విజయ్ అందరి నుంచి తప్పించుకుని షిప్ పైకి వస్తాడు. తరువాత చివర్లో ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు.. తుఫాన్.. అని థమ్స్ అప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తాడు. ఈ క్రమంలోనే ఈ యాడ్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.
గతంలో అనేక మంది స్టార్స్ థమ్స్ అప్‌కు ప్రచాకర్తలుగా ఉన్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్, మహేష్ బాబు, విశాల్ వంటి వారు థమ్స్ అప్‌కు ప్రచారం చేశారు. మొన్నీ మధ్యే థమ్స్ అప్ కంపెనీ మహేష్ బాబుతో ఉన్న తమ ఒప్పందం రద్దు అయినట్లు ప్రకటించింది. ఆ తరువాతే వారు విజయ్ దేవరకొండను ప్రచారకర్తగా తీసుకున్నారు.
Vijay Devarakonda : సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది..
తాజాగా తీసిన థమ్స్ అప్ యాడ్ హాలీవుడ్ లెవల్‌లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. అద్భుతమైన యాడ్‌తో విజయ్ ఆకట్టుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలో థమ్స్ అప్ టేస్ట్ ది థండర్.. అనే ట్యాగ్ లైన్ ఉండేది. కానీ దాన్ని మార్చారు. తెలుగులో.. ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు, తుఫాన్.. అని.. హిందీలో.. సాఫ్ట్ డ్రింక్ నహీ తుఫాన్ హై.. అని చెప్పించారు. ఏది ఏమైనా.. విజయ్ నటించిన ఈ థమ్స్ అప్ యాడ్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది.