Suman : సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిల్లో నిజం ఏది, అబద్ధం ఏది.. అని తెలుసుకోవడం కష్టంగా మారింది. చాలా మంది పుకార్లనే నిజమైన వార్తలు అని నమ్ముతున్నారు. కొందరు ఈ సందర్భంలో మోసపోతున్నారు కూడా. ఇక తాజాగా ఇలాంటిదే మరొక పుకారు వార్త బాగా ప్రచారం అయింది. అదేమిటంటే..

సీనియర్ హీరో సుమన్ భారత ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారనే వార్త ఒకటి తెగ వైరల్ అయింది. చాలా మంది దీన్ని ప్రచారం చేశారు. ఈ వార్త నిజమే అని నమ్మారు. అయితే ఇది పూర్తిగా అబద్దమని తేలింది. సుమన్ ఈ విషయంపై స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
Suman : ఆ వార్తలు పూర్తిగా అబద్దమని..
తాను తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భారత ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చానని వస్తున్న వార్తల్లో నిజం లేదని సుమన్ తెలిపారు. ఆ వార్తలు పూర్తిగా అబద్దమని, వాటిని నమ్మవద్దని కోరారు. వాస్తవానికి సదరు భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులోనే నడుస్తుందని, కనుక ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. ఆ వివాదం పరిష్కారం అవగానే దానికి సంబంధించిన వివరాలను తానే స్వయంగా మీడియా ద్వారా వెల్లడిస్తానని తెలిపారు.
కాగా సుమన్ ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా నిలుస్తున్నారు. ఆయన పలు మీడియా చానల్స్‌కు, యూట్యూబ్ చానల్స్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు.