Vidyullekha Raman : కోలీవుడ్ కమెడియన్, నటి విద్యుల్లేఖా రామన్ ఇటీవల పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్ళి తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ కి సంబంధించిన ఎన్నో ఫోటోల్ని విద్యుల్లేఖా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో బ్రేక్ ఫాస్ట్ అంటూ ఓ ఫోటోను అప్ లోడ్ చేసింది.
ఆ ఫోటో కూడా తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో విద్యుల్లేఖా రామన్ స్విమ్ సూట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అలాగే ఏడాదిలో రెండు సార్లు, ఆరు నెలల పాటు నాకు సెలవులు కావాలంటూ ఓ మెసేజ్ కూడా ట్యాగ్ చేసింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు విడాకులు ఎప్పుడు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుల్లేఖా స్పందించారు.
అంటే.. ఓ మహిళ తన భర్తతో కలిసి ఎన్ని రోజులు ఉంటుందనేది ఆమె వేసుకునే దుస్తులు డిసైడ్ చేస్తాయా ? అంటూ ప్రశ్నించారు. స్విమ్ సూట్ ధరిస్తే విడాకులు ఎప్పుడు ? అనే ప్రశ్నలు వేస్తున్నారా.. అద్భుతం అంకుల్స్ అండ్ ఆంటీస్.. 1920 నుండి బయటకు వచ్చి 2021 లోకి రండి. దుస్తులు ధరించిన వాళ్ళంతా సంతోషకరమైన వైవాహిక జీవితాల్లో ఉన్నారా ? అని ప్రశ్నించారు.
సంజయ్ లాంటి భర్త తనకు దొరకడం చాలా అదృష్టం అని, అలాంటి కామెంట్స్ ని పట్టించుకోవద్దని చెప్పారని.. కానీ తానంత ఈజీగా తీసుకోలేనని అన్నారు. అయితే వాళ్ళ జీవితంలో మహిళలు తమ వ్యక్తిత్వం కాపాడుకోవడానికి బలంగా నిలబడాలని ఆశిస్తున్నానని.. మీరు జీవించండి జీవించనివ్వండి.. అంటూ పేర్కొన్నారు.