Venu Swamy : అక్కినేని నాగచైతన్య, సమంత తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు గతేడాది అక్టోబర్ లో వెల్లడించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా ఉన్నవీరు అసలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో తెలియక చాలా మంది అనేక సందేహాలను వ్యక్తం చేశారు. అయితే అది గతం. ఇప్పుడు ఎవరి సినిమాలతో వారు బిజీగా మారిపోయారు. కానీ వీరి వివాహం నిలబడదని.. పెళ్లి అయినా సరే కలహాల కారణంగా విడిపోతారని.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అప్పట్లో చెప్పారు. ఆయన చెప్పినట్లే వారు విడిపోయారు. దీంతో ఆయన జ్యోతిష్యంపై గురి కుదిరింది.
గతంలో వేణు స్వామి జగన్ సీఎం అవుతారని చెప్పారు. అలాగే జరిగింది కూడా. ఈ క్రమంలోనే వేణు స్వామి జ్యోతిష్యం అంటే చాలా మందికి నమ్మకం ఏర్పడింది. అయితే ఈయన తాజాగా నయనతార జాతకం చూశారు. ఈ క్రమంలోనే ఆయన షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆమె జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని.. కనుక ఆమె ఇప్పుడు వివాహం చేసుకోవద్దని చెప్పారు. చేసుకున్నా వారు విడిపోతారని అన్నారు. అయితే నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్‌తో కలిసి ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించి అనేక సార్లు పూజలు చేశారు. చూస్తుంటే వారికి కూడా ఈ విషయం ముందుగానే తెలుసని.. కనుకనే వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా దాంపత్యం అన్యోన్యంగా ఉండేందుకు వారు ముందుగానే శాంతి పూజలు చేశారని తెలుస్తోంది.
అయితే వారు పూజలు చేశారు కనుక వేణు స్వామి చెప్పినట్లు జరగకపోవచ్చని అంటున్నారు. గ్రహ దోషాలు, జాతకంలో దోషాలు ఉన్నప్పుడు పూజలు చేయడం సర్వసాధారణం. కనుక ఈసారి మాత్రం ఆయన జ్యోతిష్యం ఫలించదని.. నయనతార, విగ్నేష్ శివన్ క్యూట్ కపుల్‌గా జీవనం సాగిస్తారని అంటున్నారు. ఇక ఈ విషయం తెలియాలంటే.. కొంత కాలం వరకు ఆగాల్సిందే. అయితే వేణు స్వామి గతంలో ఒకసారి అనుష్క శెట్టి, ప్రభాస్ వంటి స్టార్స్ జాతకాలపై కూడా కామెంట్లు చేశారు. అనుష్క శెట్టి వివాహం ఇప్పట్లో కాదని.. ప్రభాస్‌కు అయితే ఇంకో ఏడాదిన్నరలో వివాహం అవుతుందని అన్నారు. మరి ఆయన చెప్పింది జరుగుతుందో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…