Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటాడు. ఆయన క్రికెట్ ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెట్టినప్పుడు జులపాల జుట్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు. తరువాత కూడా తన హెయిర్ స్టైల్స్‌ను మారుస్తూ వచ్చాడు. అయితే ధోనీ అంటే చాలా మంది క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే ధోనీ మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. బయట ఎంత కూల్‌గా ఉంటాడో మైదానంలో ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరిగినా కూడా అంతే కూల్‌గా ధోనీ దర్శనమిస్తాడు. కనుకనే ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ఇక ధోనీ కెప్టెన్సీలో భారత్ టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. అందుకని ధోనీ అంటే క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అయితే తాజాగా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన బ్యాట్‌ను తింటూ కనిపించాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే చెన్నై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కానీ ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో చెన్నై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా ధోనీ బ్యాటింగ్ కోసం డగౌట్‌లో వేచి చూస్తున్నప్పుడు తన బ్యాట్‌ను తింటూ కనిపించాడు. ఇలా అతను ఎందుకు చేశాడని.. ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే దీనికి లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చాడు.
ధోనీ తన బ్యాట్‌ను అలా ఎందుకు తింటున్నాడు.. అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. దీని వెనుక పెద్ద విషయం ఏమీ లేదు. ఆయనకు ఆకలి అయి అలా చేయలేదు. ఏ బ్యాట్స్‌మన్ అయినా సరే తన బ్యాట్‌ను నీట్‌గా ఉంచుకోవాలని చూస్తాడు. అందులో భాగంగానే బ్యాట్ నుంచి బయటకు వచ్చే చిన్న చిన్న చెక్కలు, దారాలను తీసేస్తుంటారు. అయితే వాటిని కత్తెర సహాయంతో కట్ చేస్తారు. కానీ మ్యాచ్ సందర్భంగా అవి అందుబాటులో లేవేమో.. కనుకనే ధోనీ వాటిని నోటితో తీసేశాడు. అందుకనే బ్యాట్‌ను అతను కొరికి ఉంటాడు.. అంతేకానీ.. అతనికి ఆకలై కాదు.. అని అమిత్ మిశ్రా సమాధానం చెప్పాడు. దీంతో ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. అలాగే ధోనీ ఫొటో కూడా వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…