Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా 15 ఏళ్లకు పైగా తెలుసు. వయస్సు మీద పడుతున్నా ఈమె అందం తగ్గడం లేదు.. అవకాశాలు కూడా తగ్గడం లేదు. హిందీ, తెలుగు, తమిళం.. అనే తేడా లేకుండా దాదాపుగా అన్ని భాషలకు చెందిన సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇక ఈమె ఐటమ్ సాంగ్స్‌తోనూ మెప్పిస్తోంది. సరిలేరు నీకెవ్వరులో బ్యాంగ్ బ్యాంగ్ అంటూ అలరించింది. తరువాత నితిన్ మ్యాస్ట్రో మూవీలో నెగెటివ్ రోల్ చేసి ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 మూవీలోనూ ఈమె కనిపించి అలరించనుంది.
అయితే ఎల్లప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే తమన్నా ఏడ్చేసింది. అవును.. నిజమే. ఇంతకీ అసలు తమన్నా ఎందుకు ఏడ్చింది ? దానికి కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే.. యాంకర్ సుమ చేస్తున్న అనేక టీవీ షోలలో క్యాష్ ప్రోగ్రామ్ ఒకటి. ఈ షో తాజాగా 200వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక షో నిర్వహించారు. దీనికి ఎఫ్3 టీమ్ దర్శకుడు అనిల్ రావిపూడి, తమన్నా, సోనాల్ చౌహాన్, సునీల్‌లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
అయితే షోలో భాగంగా సుమ అందరినీ నవ్విస్తూ భలే ఎంటర్‌టైన్ చేసింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు పంచ్ డైలాగ్ లు కూడా వేసుకున్నారు. కానీ షోకు చెందిన ప్రోమో చివర్లో తమన్నా ఏడుస్తూ కనిపించింది. దీంతో అసలు ఏమై ఉంటుందా ? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే అది షోలో భాగమేనని.. ఆమెను ఏదైనా ఏడుపు సీన్‌లో ఎలా ఏడుస్తారు.. అని అడిగితే.. అందుకు ఏడ్చి చూపించి ఉంటుందని.. తెలుస్తోంది. ఇక ఈ షోలో తమన్నా ఎందుకు ఏడ్చిందో తెలుసుకోవాలంటే.. షో ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. కాగా తమన్నా ఎఫ్3లో వెంకటేష్ పక్కన నటించింది. ఎఫ్2 లాగే ఈ మూవీ కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…