Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి నెలలో ఈమె ఉన్నట్టుంది సడెన్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. అయితే ఈ మధ్యే ఆ ఖాతాను యాక్టివేట్ చేసింది. కానీ తన జిమ్ ట్రెయినర్‌తో కలసి ఉన్న వీడియో మాత్రం ఆమె ఖాతాలో కనిపించలేదు. దీంతో ఆమె ఆ వీడియోను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దానివల్లే తన అత్తింటి వారి నుంచి ఆమె విమర్శలను ఎదుర్కొందని సమాచారం. కనుకనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేసిందని.. తరువాత యాక్టివేట్ చేసినా ఆ వీడియో లేదు కనుక అందరూ అనుకున్నట్లుగానే జరిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయమే కాకుండా.. ఆమె పేరు డ్రగ్స్ కేసులో వినబడడం చర్చనీయాంశంగా మారింది.
నిహారిక.. ఇంకొంతమంది సెలబ్రిటీల పిల్లలు పబ్‌లో దొరకడం.. ఆ సమయంలో డ్రగ్స్ లభించడంతో ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందని అనుకున్నారు. కానీ నాగబాబు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కేవలం పార్టీ కోసమే అక్కడికి వెళ్లింది కానీ తన కుమార్తె ఎలాంటి డ్రగ్స్‌ను తీసుకోలేదని ఆయన అన్నారు. అయినప్పటికీ తెలుగు పండుగ ఉగాది రోజు అర్థరాత్రి పూట భర్త లేకుండా ఆమె పబ్‌లో ఏం చేస్తుందని నెటిజన్లు ప్రశ్నించారు. దీనికి ఆయన వద్ద సమాధానం లేకుండా పోయింది. అయితే అదంతా గతం. ఇకపై నిహారిక కొత్త కొత్తగా కనిపించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె ఓ పోస్టులో తెలియజేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.
నిహారిక ఆమె భర్త జేవీ చైతన్యతో కలిసి జోర్డాన్‌కు టూర్ వెళ్లారు. అక్కడ ఆకాశంలో విహరిస్తూ వీడియోలు తీసుకున్నారు. ఐఫోన్‌లతోపాటు డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలను చిత్రీకరించారు. దీంతో ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. నిహారిక త్వరలోనే ఓ ట్రావెల్ షోలో పాల్గొంటుందని.. అందుకనే ఇలా భర్తతో కలసి ప్రస్తుతం విహార యాత్రలకు వెళ్తుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె తన భర్తతో కలసి ముందుగా పలు దేశాల్లో విహరిస్తుందని.. వాటి తాలూకు వీడియోలతో ఓ షో చేస్తుందని తెలుస్తోంది.
ఇక ఆ షోను ఓ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమ్ చేస్తుందని.. హిందీలో ఓ నేషనల్ టీవీలోనూ ఆ షోను టెలికాస్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇదంతా విశ్వసనీయ సమాచారమే. దీని గురించి త్వరలో వివరాలను వెల్లడిస్తారేమో చూడాలి. నిజంగా ఇది కరెక్టే అయితే నిహారిక షోకు మంచి రేటింగ్స్ వస్తాయని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక నిహారిక ప్రస్తుతం తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌కు చెందిన సిరీస్‌లతో బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…