Venu Madhav : కోదాడ నుంచి వచ్చి సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని స్టార్ట్ చేసిన వేణుమాధవ్ ఆనతి కాలంలోనే స్టార్ కమెడీయన్‌గా ఎదిగాడు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితే చాలా బిజీ కమెడీయన్‌గా ఉన్న సమయంలో వేణు మాధవ్ చాలా ఆస్తులు కూడా కూడబెట్టాడు. అయితే ఆయన మరణం, ఆస్తులు గురించి వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. నాకు ముగ్గురు మగపిల్లలు కాగా అందులో ఇద్దరు మగపిల్లలు. వేణు మాధవ్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు .. మిమిక్రీ బాగా చేసేవాడు. అప్పుడే ఒక ప్రోగ్రామ్ లో ఆయనను ఎస్వీ కృష్ణారెడ్డి – అచ్చిరెడ్డిగారు చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.
వచ్చిన అవకాశాన్ని వేణు మాధవ్ బాగా ఉపయోగించుకున్నారు. ఇండస్ట్రీలో నటుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వేణుకి ఒక అలవాటు ఉండేది.. ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదు. తలనొప్పి వచ్చినా టాబ్లెట్ కూడా వేసుకునే అలవాటు వేణుకి లేదు.. అదే అతని కొంపముంచింది అన్నారు సావిత్రమ్మ. అయితే కొడుకు ఎదుగుదల చూసి సంతోషించానని.. సినిమాలతో వేణు మాధవ్ బిజీగా ఉండటం వలన నా ఇద్దరు కొడుకులను కూడా ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేశాను. అయితే అదే నేను చేసిన పెద్ద తప్పు అన్నారు సావిత్రమ్మ.

జాండిస్, డెంగ్యూ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే వేణు మాధవ్ చాలా నిర్లక్ష్యం చేశాడు. దాంతో పరిస్థితి చేయి దాటిపోయి వేణు మాధవ్ చనిపోయాడని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది సావిత్రమ్మ. వేణు చనిపోయే నాటికి రూ. 20 కోట్లకి పైగా ఆస్తులున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. కూతురు పెళ్లి టెన్షన్ తో ఒక కొడుకు చనిపోగా, అతను చనిపోయిన నెలా పదిహేను రోజుల్లోనే వేణుమాధవ్ కూడా చనిపోయాడు. ఇద్దరు కొడుకుల చావు చూసి..నేను ఎందుకు బతికి ఉన్నానా అని అనిపించింది. ఇక వేణు మాధవ్ చనిపోయేనాటికే చాలా ఆస్తులు ఉన్నాయని.. ఏడెనిమిది ఫ్లాట్ లతో పాటు దాదాపు 20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయన్నారు. అన్ని ఉన్నా తల్లిగా నాకు ఉపయోగం ఏమీలేవు.. నేను మాత్రం మరో కొడుకును చూసుకుంటూ.. అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాను అని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.