Veera Simha Reddy : అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో అదరిపోయే హిట్ అందుకున్నాడు.బాలయ్య మాస్ మసాలా డైలాగ్స్ అలాగే యాక్షన్‌కు థియేటర్స్ అన్నీ కూడా దద్దరిల్లిపోయాయి అని చెప్పాలి. బాలయ్య రెండు పాత్రలలో అలాగే మూడు గెటప్పుల్లో అదరగొట్టడంతో ఫ్యాన్స్ కి పూనకాలు రావడమే కాదు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపిచంద్ మలినేని నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ మరియు హనీ రోజ్ హీరోయిన్ లు గా నటించారు.
చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు మరియు మురళీ శర్మ.. ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ కోసం ఎంతో ఆతృత గా చూస్తున్నారు అభిమానులు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ+ హాట్‌స్టార్ వీరసింహరెడ్డి స్ట్రీమింగ్ హక్కుల ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఓటీటీ హక్కుల కోసం హాట్ స్టార్ భారీగానే డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే వీర సింహారెడ్డి చిత్రాన్ని ఫిబ్రవరి 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య గత చిత్రం అఖండ ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టారే దక్కించుకుంది. అప్పట్లో అఖండ ఓటీటీలో ఓ సంచలనాన్ని సృష్టించింది. వీరసింహారెడ్డి చిత్రం 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. వీరసింహారెడ్డి చిత్రాని కి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ హీట్ పెంచాయి అని చెప్పవచ్చు . ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. సుగుణ సుందరి అలాగే మా బావ మనోభావా లు అదే విధంగా జై బాలయ్య వంటి పాటలు ఫ్యాన్స్ కు తెగ నచ్చేయడంతో మూవీకి హైప్ వచ్చింది.. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా అల్లాడించాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ మాత్రం ప్రేక్షకులకి పిచ్చెక్కేలా చేశాయి.