Varshini : సాధారణంగా మనకు నచ్చని పని గురించి లేదా మనకు నచ్చని వాటి గురించి ఎవరైనా పదేపదే ప్రశ్నలు అడిగితే ఎవరికైనా ఎక్కడో కాలుతుంది. ఇలా పదే పదే వాటి గురించి ప్రశ్నిస్తే తీవ్రస్థాయిలో అవతల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తాము. యాంకర్ వర్షిణి కూడా ఇలాగే చేస్తానని అంటోంది. బుల్లితెర యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లు అంటూ ఎంతో బిజీగా గడుపుతోంది. వెబ్ సిరీస్ లతోపాటు పలు సినిమా అవకాశాలను కూడా అందుకొని ఎంతో బిజీగా ఉన్న వర్షిణి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ పిచ్చెక్కిస్తుంటుంది. ఇక నెటిజన్ల నుంచి తరచూ తనకు నచ్చని ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ.. 26 ఏళ్లు వచ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా ? చేసుకోలేదా ? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లకి తాను గట్టిగా సమాధానం చెబుతానని చెప్పింది. అలాంటి వారికి ఒక ప్రత్యేకమైన రిప్లై ఇస్తానని చెప్పింది.
ఈ సందర్భంగా వర్షిణి పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఎవరైనా తనని అలాంటి ప్రశ్న వేస్తే.. మనం ప్రస్తుతం 2022 లో ఉన్నాము. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించడం పక్కనపెట్టి మన గురించి మనం ఆలోచించుకోవాలని.. సమాధానం చెబుతా.. అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఈమెకు నిశ్చితార్థం జరిగినా కూడా ఆ నిశ్చితార్థం అక్కడితోనే ఆగిపోయింది. దీంతో పెళ్లిపై చిరాకు కలిగిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి అనే మాటకు దూరంగా ఉంటూ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం తన కెరియర్ పై పెట్టింది.