Krithi Shetty : ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమానే విజయవంతం కావడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే గత ఏడాది శ్యామ్ సింగ రాయ్,అలాగే ఈ ఏడాది బంగార్రాజు వంటి చిత్రాలతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ తో కలిసి వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఇలా పలు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమా అవకాశాలను అందుకుంటోంది. ఇదిలా ఉండగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కృతి శెట్టి రెండవ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుందని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు ఇదే కనుక నిజమైతే స్టార్ డైరెక్టర్ సినిమాతో బేబమ్మ కోలివుడ్ ఎంట్రీ ఇవ్వనుండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మరో పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు పెద్దఎత్తున వార్తలు వెలువడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా అందులో ఒకరిగా బేబమ్మ ఆ అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడం చూస్తుంటే ఈమె లక్ మామూలుగా లేదని చెప్పవచ్చు.