Smart Phone : సాధారణంగా కొత్త స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వారు అప్పటి వరకు వాడే పాత స్మార్ట్ ఫోన్‌లను విక్రయిస్తుంటారు. వాటిని ఏం చేయాలో తెలియిక ఎంతో కొంత ధరలకు అమ్మేస్తుంటారు. అయితే అంత తక్కువ ధరలకు ఆ ఫోన్లను అమ్మడం కన్నా.. వాటిని సీసీటీవీ కెమెరాల్లాగా ఉపయోగించుకుంటే మన ఇంటికి సెక్యూరిటీ లభిస్తుంది. మరి మీ పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
మీ పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ అయితే.. అందులో ముందుగా Alfred అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. దీన్ని పాత ఫోన్, కొత్త ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ క్రమంలోనే ఈ యాప్ పాత, కొత్త ఫోన్‌లలో ఇన్‌స్టాల్ అయ్యాక అందులో సూచించిన మేర స్టెప్స్ ను ఫాలో కావాలి. దీంతో పాత దాంట్లో కెమెరా లైవ్ ఫీడ్ వస్తుంది. దాన్ని కొత్త ఫోన్‌లో ఈ యాప్ ద్వారా చూడవచ్చు.
అయితే పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను మీ ఇంట్లో లేదా ఇంటి బయట ఏదైనా ఒక ప్రదేశంలో ఫిక్స్‌డ్ గా ఉంచాలి. దీంతో అది సీసీటీవీ కెమెరాలా పనిచేస్తుంది. అందులో ఉన్న Alfred యాప్ ద్వారా లైవ్ ఫీడ్ మీ కొత్త ఫోన్‌లోని అదే యాప్‌లో కనిపిస్తుంది. దీంతో మీ పాత ఫోన్ సీసీటీవీ కెమెరాలా పనిచేస్తుంది.
ఈ యాప్ ద్వారా డేటా మొత్తం క్లౌడ్ స్టోరేజ్‌లో 30 రోజుల పాటు సేవ్ అవుతుంది. అయితే ప్రీమియం వెర్షన్‌ను కొనుగోలు చేస్తే మరిన్ని సదుపాయాలను పొందవచ్చు. ఈ విధంగా ఈ యాప్ సహాయంతో మీ పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను సీసీటీవీ కెమెరాలా మార్చుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…