Chiranjeevi : కరోనా.. అది ఎవరినీ వదలడం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. అని తేడా లేకుండా అందరికీ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా సోకింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్ బాబు, మంచు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్, విశ్వక్ సేన్, త్రిష తదితర నటీనటులు ఈ మధ్యకాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా చిరంజీవి కోవిడ్‌కు గురవడం అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తోంది.
తాను కరోనా బారిన పడ్డాననే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను అన్ని జాగ్రత్తలను తీసుకున్నానని, అయినప్పటికీ కరోనా బారిన పడ్డానని చిరంజీవి తెలిపారు. తనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వివరించారు. తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. త్వరగా కోలుకుని మళ్లీ అభిమానుల ముందుకు వస్తానన్నారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా చిరంజీవి ప్రస్తుతం పలు వరుస సినిమాలను చేస్తున్నారు. ఓ వైపు ఆచార్య మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా.. మరోవైపు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల షూటింగ్‌లో మెగాస్టార్ పాల్గొంటున్నారు. ఈ మధ్యే ఆయన ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలోనే ఇండస్ట్రీకి అనుకూలంగా ఓ నిర్ణయం వస్తుందని తెలిపారు.
కాగా భోళా శంకర్ చిత్ర షూటింగ్‌లో చిరంజీవి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కూడా ఇటీవలే కరోనా బారిన పడింది. అయితే కీర్తి సురేష్ నటించిన మరో మూవీ గుడ్ లక్ సఖి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 26న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావల్సి ఉంది.
కానీ చిరంజీవి కరోనా బారిన పడడంతో ఆయన లేకుండానే ఆ ఈవెంట్‌ను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 28వ తేదీన విడుదల కానుంది. ఇక తాజాగా పద్మ అవార్డులను అందుకున్న అందరికీ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…