Upasana : రామ్ చరణ్ సతీమణి ఉపాసన సినిమాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఎప్పుడు బిజీగా ఉంటోంది. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోను ఆమె షేర్ చేసింది. అయితే.. ఈ ఫోటోలో ఉపాసన ధరించిన దుస్తులు హుందాగా లేకపోగా.. ఆమె స్థాయికి ఏ మాత్రం సరిపోయేలా లేవని చెప్పక తప్పదు. ర్యాప్ జీన్స్.. అది కూడా పెద్ద ఎత్తున చిరుగులతో ఉన్న జీన్స్ ను ఆమె ధరించిన వైనాన్ని తప్పు పడుతున్నారు.
దేశ ప్రధానిని కలిసిన సమయంలో అలాంటి దుస్తులు ధరించడమేంటని మండిపడుతున్నారు. ఇలాంటి దుస్తులు ధరించాలంటే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకల సందర్భంగా ధరిస్తే బాగుంటుంది కదా ? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గౌరవనీయ స్థానాల్లోని వారిని ఒక సంస్థ నుంచి ప్రాతినిధ్యం వహించేటప్పుడు హుందాతనాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ అయితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్ పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నాను. ఆవిష్కరణ.. ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపరచడం.. మహిళా సాధికారత.. కల్చర్ పరిరక్షణ మీద దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాల్ని ఇస్తుందన్నారు.. అని ఉపాసన పేర్కొంది.