Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ఓ వైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను నెరవేరుస్తూనే.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే చరణ్ వ్యాపారాలను కూడా స్వయంగా ఆమే పర్యవేక్షిస్తుంటారు. ఇప్పటికే 200కు పైగా అనాథ, వృద్ధాశ్రమాలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. జూ పార్క్ లో వన్య ప్రాణులను దత్తత తీసుకున్న ఆమె వాటి సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. ఇక ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
మెగా కోడలు ఉపాసన గతంలో ఆడి ఇ-ట్రాన్(Audi E Tron) కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కారుకు సంబందించిన వీడియోను ఆమె నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తాను అప్‌గ్రేడ్ అయ్యానంటూ ఆమె చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతీది అప్‌గ్రేడ్ అవుతుందని చెప్పిన ఉపాసన.. అందుకనుగుణంగా తాను కూడా అప్‌గ్రేడ్ అయ్యానంటూ చెప్పారు. అందులో భాగంగానే ఆడి ఇట్రాన్ కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు. తన అన్ని అవసరాలకు కూడా ఈ కారు ఎంతో అనువుగా ఉందంటూ చెప్పుకొచ్చారు.
ప్రయాణానికి సైతం ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉందని.. వాయిస్ కమాండింగ్ ఆప్షన్ మరింత బాగుందంటూ ఉపాసన వీడియోను పంచుకున్నారు. ఇక ఈ కారు ధర రూ.1.20 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. గతంలో కారు కొన్న సందర్భంలో.. మీరు భవిష్యత్ కోసం సిద్ధంగా ఉన్నప్పుడు.. సౌకర్యం, లగ్జరీ విషయంలో ఎప్పుడూ రాజీపడనప్పుడు.. అదే నిజమైన పురోగతి అనిపించుకుంటుంది. స్థిరమైన, ప్రగతిశీల, విలాసవంతమైన భవిష్యత్‌ను నిర్మించడానికి ఇదే ఆరంభం.. అంటూ ఉపాసన చెప్పిన మాటలను ఆడి కంపెనీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
కాగా ఉపాసన కొత్త కారును చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఎంతో లగ్జరీగా ఉందని, కలర్ కూడా బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.