Pragathi : తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అనేక సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మమతల కోవెల అనే సీరియల్‌లోనూ ఈమె యాక్ట్ చేసింది. 45 ఏళ్ల వయస్సులోనూ ఈమె ఎంతో ఫిట్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ప్రగతి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలను ఆమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక ఆమె జిమ్‌లో వర్కవుట్స్ చేసే వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. అవి వైరల్ అవుతుంటాయి.
అయితే ప్రగతి సినిమాల్లో సంప్రదాయబద్దంగా కనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో మాత్రం గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అలాంటి ఫోటోలను కూడా ఆమె అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇక డ్యాన్స్ చేయడంలోనూ ప్రగతి దిట్టే. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈమె తన డ్యాన్స్ వీడియోలు ఎన్నింటినో అప్ లోడ్ చేసింది. అలాంటి వాటిల్లో ఆమె తీన్మార్ డ్యాన్స్ వీడియో కూడా ఒకటి. ఇందులో ప్రగతి అదిరిపోయేలా స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియో పాతదే అయినప్పటికీ నెటిజన్లు దాన్ని మళ్లీ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్యాన్స్ చాలా బాగా చేశావంటూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఇక ఆమె డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram