Upasana : ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌తో ఆ చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలోనే అటు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్, ఇటు చరణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రస్తుతం రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అయితే ఈ మూవీ సక్సెస్ వేడుకలతోపాటు ఎన్‌టీఆర్, చరణ్ ల సతీమణులు వారి బర్త్ డే వేడుకలను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ.. ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ పుట్టిన రోజులు రావడంతో ఇరు కుటుంబాలకు చెందిన వారు వేడుకల్లో మునిగిపోయారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ అయింది కనుక ఆ వేడుకలు, బర్త్ డే వేడుకలు కలిపి ఒక రేంజ్‌లో పార్టీలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్ భార్య ఉపాసన, ఎన్‌టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిలు వేడుకల్లో మునిగిపోయిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదలైన తొలి రోజే ఉపాసన, లక్ష్మీ ప్రణతిలు వీక్షించారు. ఉపాసన అయితే థియేటర్లో చరణ్ ఇంట్రడక్షన్ సమయంలో పేపర్లను కూడా చింపి విసిరేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన భార్యకు బర్త్ డే గిఫ్ట్ ఏం ఇస్తారు ? అని అడిగితే అందుకు ఎన్‌టీఆర్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్.. అని చెప్పారు. చెప్పినట్లే ఆ గిఫ్ట్‌ను ఇచ్చారు. ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రణతి, ఉపాసనల ఫొటో వైరల్ అవుతోంది.