Unstoppable Show : బుల్లితెరపై ఇప్పటికే ఎంతో మంది హీరోలు యాంకర్లుగా మారి సందడి చేసిన విషయం విదితమే. నాగార్జున, నాని బిగ్ బాస్ ద్వారా, ఎన్‌టీఆర్ బిగ్‌బాస్‌తోపాటు ఎవరు మీలో కోటీశ్వరుడు ద్వారా, రానా నంబర్ వన్ యారి అనే ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు. అయితే వీరి బాటలోనే గతేడాది నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా మారారు. అన్‌స్టాపబుల్ అనే షో చేశారు. గతేడాది ప్రసారమైన ఈ షోకు చెందిన ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంతో అలరించాయి.
సాధారణంగా బాలకృష్ణ అంటే.. ఆయన గురించి ఒక వైపు మాత్రమే తెలుసు. రెండో వైపు తెలియదు. కానీ అన్‌స్టాపబుల్ షో ద్వారా ఆయన రెండో వైపు కూడా తెలిసిపోయింది. అందరినీ నవ్విస్తూ ఎంటర్‌టైన్ చేసే వ్యక్తిగా ఆయన నిలిచారు. ఈ క్రమంలోనే తొలి సీజన్‌లో పలువురు సెలబ్రిటీలు గెస్ట్ లు గా వచ్చి సందడి చేశారు. అయితే త్వరలోనే అన్‌స్టాపబుల్ షో రెండో సీజన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దసరాకు ఈ షో రెండో సీజన్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అందుకు ఇప్పటి నుంచే మేకర్స్ ప్రయత్నాలను మొదలు పెట్టారట.

అన్‌స్టాపబుల్ షో సక్సెస్ కావడంతో అన్‌స్టాపబుల్ 2 ను నిర్వహించేందుకు ప్రస్తుతం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ 2ను దసరాకు లాంచ్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు చిరంజీవిని గెస్ట్‌గా పిలవాలని చూస్తున్నారట. దీంతో ఈ సారి ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుందని తెలుస్తోంది. మొదటి సీజన్‌లాగే రెండో సీజన్‌లోనూ పలువురు ప్రముఖులను గెస్ట్‌లుగా పిలవనున్నారట. ఇక బుల్లితెరపై అత్యంత సక్సెస్ సాధించిన షోలలో ఒకటిగా అన్‌స్టాపబుల్ నిలిచింది. దీంతో రెండో సీజన్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు.