Sai Dharam Tej : తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న తేజ్ నటన, డ్యాన్స్ పరంగా మంచి మార్కులనే కొట్టేశాడు. ఈ క్రమంలోనే గతేడాది తన రిపబ్లిక్ మూవీ సినిమా విడుదలకు ముందు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాల పాలైన తేజ్ సుమారుగా 40 రోజుల పాటు హాస్పిటల్‌లో ఐసీయూలో ఉండి చికిత్స తీసుకున్నాడు.
ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి బయటకు వచ్చాక కూడా తేజ్ బయట ఎక్కువగా కనిపించలేదు. ఒకటి రెండు సార్లు మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపించాడు. అయితే అప్పుడు తేజ్ బాగానే ఉన్నాడు. కానీ తాజాగా బయటకు వచ్చిన ఆయన ఫొటోను చూసి అభిమానులు షాకవుతున్నారు. తేజ్ ఇంత గుర్తు పట్టలేకుండా దారుణంగా మారిపోయాడేంటి.. అని ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. తాజాగా విక్రమ్ సినిమా సక్సెస్ నేపథ్యంలో కమల హాసన్ చిరంజీవిని కలవగా.. కమలహాసన్‌తోపాటు సల్మాన్ ఖాన్‌ను కూడా చిరు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెగా హీరోలు అందరూ పాల్గొన్నారు. ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. కమలహాసన్, చిరంజీవిలతో కలిసి నవ్వుతూ కనిపించాడు.

అయితే ఈ ఫొటోల్లో తేజ్‌ను చూసి షాకవుతున్నారు. మరీ దారుణంగా బక్క చిక్కి సన్నగా అసలు గుర్తు పట్టరాకుండా మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి తేజ్ యాక్సిడెంట్ జరిగిన అనంతరం అసలు బయటకు రాలేదు. కానీ ఈ మధ్యే ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అప్పుడు బయటకు వచ్చాడు. అప్పుడు బాగానే ఉన్నప్పటికీ ఈ కాస్త సమయంలోనే మరీ ఇలా మారిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే దీని వెనుక ఏం జరిగి ఉంటుందో తెలియదు కానీ.. తేజ్ మాత్రం ప్రస్తుతం చిత్ర షూటింగ్‌లతో మళ్లీ బిజీ అయిపోయాడు. ఆయన తదుపరి చిత్రం హార్రర్ కథాంశంతో ఉంటుందని ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక ఈ మూవీ గురించి త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.