Under 19 Cricket World Cup 2022 : అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాపై సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగు పెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును భారత్ చిత్తు చిత్తు చేసింది. భారీ పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ యశ్ ధుల్ వీరోచితమైన సెంచరీ ఉంది.

భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్ యశ్ ధుల్ 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 110 పరుగులు చేశాడు. అయితే తన ఇన్నింగ్స్‌లో యశ్ ధుల్ కొట్టిన సిక్స్ తాలూకు వీడియో వైరల్‌గా మారింది. క్రికెట్ పుస్తకాల్లో అసలు అతను ఆడిన షాట్‌కు పేరే లేదు. దీనికి ఎలాంటి పేరు పెట్టాలో చెప్పాలని సాక్షాత్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే యశ్ ధుల్ ఆడిన షాట్ వీడియో వైరల్ అవుతోంది.
WHAT A HIT 🔥
Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4
— ICC (@ICC) February 3, 2022
కాగా భారత్, ఇంగ్లండ్ ల మధ్య ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ఈ నెల 5వ తేదీన జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దీని కోసం యావత్ భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.