Rakul Preet Singh : ఆ భాష.. ఈ భాష అనే తేడా లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ దాదాపుగా అనేక భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె ఓ దశలో వరుస ఆఫర్లతో బిజీ అయింది. అయితే ప్రస్తుతం ఇతర యంగ్ హీరోయిన్ల కారణంగా రకుల్ ప్రీత్‌కు ఆఫర్లు తగ్గాయనే చెప్పవచ్చు. కానీ తాజాగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఓ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. ఈమె నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడీమెకు బాలీవుడ్ లో ఈ అవకాశం రావడం నిజంగా ఆమె అదృష్టమనే చెప్పవచ్చు.
రకుల్ ప్రీత్ సింగ్ నటించిన న్యూ అవతార్ అనే హిందీ మూవీ త్వరలో విడుదల కానుంది. అలాగే జాన్ అబ్రహం, జాక్వెలైన్ ఫెర్నాండెజ్లతో కలిసి రకుల్ నటించిన అటాక్ మూవీ కూడా త్వరలో విడుదల కానుంది. ఇక థాంక్ గాడ్ మూవీలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఈ క్రమంలో తెలుగులో ఈ భామకు అవకాశాలు అంతగా లేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఫుల్ బిజీగా మారిందని చెప్పవచ్చు.