Udaya Bhanu : ఉదయభాను యాంకర్‌గానే కాక సినిమాల్లోనూ కూడా నటించి అలరించింది. ఈమె రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమాలో రాజశేఖరా.. అంటూ ప్రత్యేక పాటలోనూ నర్తించి ఆకట్టుకుంది. ఇటీవల పుష్ప సక్సెస్ ప్రోగ్రాం కర్నూల్ లో యాంకర్ గా చేసి బన్నీ ఫాన్స్ ని అలరించింది. గ్లామరస్ యాంకర్లు ఇప్పుడు బోలెడు మంది ఉన్నారు కానీ ఒకప్పుడు అలాంటి యాంకర్ అంటే మాత్రం ఉదయభానే. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని పర్సనాలిటీ, అందంతో అందరి మనసు దోచుకుంది. అందం మాత్రమే కాకుండా తన మాటలతో మంత్రముగ్దులను చేసేది.
ఉదయభాను అనగానే హృదయాంజలి షో, సాహసం చేయరా డింభకా, డాన్స్ బేబీ డాన్స్ వంటి షోలు గుర్తొస్తాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదయభాను ఆ తరువాత బుల్లితెరకి దూరమైంది. ఇక ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను టీవీకి, సినిమాలకు పూర్తిగా దూరమైంది. కూతుర్లు పెద్దగా అవ్వడంతో మళ్ళీ యాంకర్ గా బిజీగా ఉండాలని భావించిన ఉదయభాను ఆ దిశగా ప్రయత్నించినా అవకాశాలు రావడం లేదు.

ఇక యూట్యూబ్ లో ఛానెల్ పెట్టి తన వ్యక్తిగత జీవితాన్ని అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటున్న ఉదయభాను రీసెంట్ గా తన చిన్న కూతురుతో ఉన్న వీడియోని షేర్ చేసింది. రోజూ ఉదయాన్నే టీ తాగాలనుకుంటే.. నా భూమి తల్లి టీ పెట్టడానికి కావాల్సిన పదార్థాలు కలిపి నాకు హెల్ప్ చేస్తుంది అంటూ కూతురిని ముద్దాడుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లీకూతురు ఇద్దరు క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram