Trisha : చెన్నై చంద్రం త్రిష నాలుగు పదుల వయస్సులోనూ తెగ సందడి చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నానా హంగామా చేస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో త్రిష ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న ‘రామ్’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. మరోవైపు డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతోంది. ‘బృంద’ అనే తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇతర భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్‌ను అనువదించనున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.
తాజాగా త్రిషకి అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా నిలిచారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసింది త్రిష. ఇక ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు.
తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి నటి త్రిష. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…