Peddanna Movie Review : సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ప్రేక్షకులలో ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాలపై పిచ్చ క్రేజ్ ఉంటుంది. రజినీకాంత్ ఈ దీపావళికి ‘పెద్దన్న’గా అందరి ముందుకొచ్చారు. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్, లేడీ సూపర్ స్టార్ నయనతారతోపాటు సీనియర్ బ్యూటీ మీనా కీలక పాత్రల్లో నటించారు.
తమిళంలో అన్నాత్తెగా రూపొందిన రజనీ చిత్రం తెలుగులో పెద్దన్నగా రిలీజ్ అయింది. ఇందులో రజినీ వన్ మ్యాన్ షో కనబరిచారు. బ్రదర్ – సిస్టర్ రిలేషన్ సెంటిమెంట్‌తో సాగిపోయిన ఈ సినిమా ఫస్టాఫ్ కాస్త బోరింగ్ గానే నడిచింది. తన పంచ్ డైలాగ్స్ తో డైలాగ్ డెలివరీ, సూపర్ ఫైటింగ్ తో అలరించారు. పెద్దన్న సినిమాలో నయనతార హీరోయిన్ గా తన పాత్ర మేరకు నటించింది. అద్భుతమైన స్క్రీన్ ప్రజంటేషన్ తో నీట్ పర్ఫార్మెన్స్ ను అందించారు.
కథ విషయానికి వస్తే.. చెల్లెల్ని అమితంగా ప్రేమించే ఓ అన్న రజనీకాంత్. ఎప్పుడూ చెల్లెలి క్షేమం కోసం, ఆనందం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆమెకు ఎలాంటి హాని జరగకుండా చూస్తాడు. అలాంటి చెల్లెలు అన్న చూసిన సంబంధం కాదని ఇంటి నుండి వెళ్తుంది.. ఆమె తిరిగి ఇంటికి వచ్చిందా, తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘పెద్దన్న’ సినిమా సూపర్ హిట్ పక్కా అని చెబుతుండగా మరికొందరు బోరింగ్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విలన్ రోల్ పోషించిన జగపతి బాబు అదరగొట్టేశారని అంటున్నారు. అలాగే ఇమ్మాన్ కట్టిన బాణీలు సినిమాలో హైలైట్ అయ్యాయి. దర్శకుడు శివ సినిమాని అనుకున్నంతగా ప్రజెంట్ చేయలేకపోయాడు. మొత్తానికి దీపావళికి వచ్చిన ఈ సినిమా అంతగా పేలలేదనే చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…