Triphala Churnam : త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద ఔషధం. ఈ ఔషధం మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభిస్తున్న సర్వరోగ నివారిణి. త్రిఫల చూర్ణాన్ని ప్రకృతి సిద్ధమైన యాంటీ బయోటిక్ అని కూడా పిలుస్తారు. మన దేహంలోని విషపదార్థాలను శుభ్రం చేయడంలో ఈ త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన ఈ మిశ్రమాన్నే త్రిఫల చూర్ణం అని అంటారు. త్రిఫల చూర్ణంలో ఉన్న ఉసిరికి చలువచేసే గుణం కలిగి ఉంటుంది. ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అదేవిధంగా కరక్కాయ కాలేయానికి సంబంధించిన భయంకర వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. అంతేకాకుండా నాడీ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. తానికాయ అజీర్తి సమస్యతో బాధపడేవారికి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఈ మూడు కలిసిన త్రిఫల చూర్ణంగా మానవ శరీర ఆరోగ్యం కాపాడడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలను నియంత్రిస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సహాయపడతాయి. ఈ మూడింటినీ మెరుగుపరిచే గుణం త్రిఫల చూర్ణానికి ఉంది. అందుకనే ఈ త్రిఫల చూర్ణాన్ని నేటికీ కూడా అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తాయో మనిషి ఆరోగ్యంగా సరైన బరువులో ఉంటాడు. ఈ మూడు దోషాలు మన శరీరంలో సక్రమంగా పనిచేయవో మనిషి అధిక బరువు పెరగడం అనే ప్రక్రియ మొదలవుతుంది. అధిక బరువుతో బాధపడుతున్నవారు త్రిఫల చూర్ణం తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలోకి వస్తుంది.
100 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకుంటే 52 గ్రాములు కార్బొహైడ్రేట్స్ 38 గ్రాములు ఫైబర్ ఉంటాయి. ఈ త్రిఫల చూర్ణం ఔషధం బరువు తగ్గించడంలో ఎలా పని చేస్తుంది అనే పరిశోధన చేశారు. బరువు తగ్గడానికి త్రిఫల చూర్ణం ఎలా ఉపయోగపడుతుందని పరిశోధన చేస్తే 64 మంది, మరొక 64 మంది రెండు గ్రూపలకు చెందిన వారి బరువుపైన పరిశోధన ప్రారంభించి 2012లో షాహిద్ యూనివర్సిటీ వీరిద్దరికీ సమానంగా వ్యాయామం, డైట్ సమానంగా చేయించారు.
మొదటి 64 మందికి ఐదు గ్రాముల త్రిఫల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం ఇచ్చేవారు. మరొక అరవై నాలుగు మందికి త్రిఫల చూర్ణం కాకుండా హెర్బల్ పౌడర్ ఇచ్చేవారు. మూడు నెలల పాటు ఇదే విధంగా ఇస్తే త్రిఫల తీసుకున్న 64 మంది, త్రిఫల చూర్ణం తీసుకోని 64 మంది కంటే ఐదు కేజీలు బరువు తగ్గారు అని పరిశోధనలో వెల్లడయింది. ఈ త్రిఫల బరువు తగ్గడానికి సైంటిఫిక్ గా పరిశోధన చేస్తే కణం లోపల ఆహార పదార్థాలను బాండ్ చేసే మైటోకాండ్రియాలు మెటబాలిజంని పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇక రెండో పరిశోధన 2012లో హైదరాబాదులో బిట్స్ పిలాని క్యాంపస్ లోఎలుకల పైన పరిశోధన చేశారు.
ఈ త్రిఫల చూర్ణం నిత్యం తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరగడం లేదు అని ఈ పరిశోధన ద్వారా తేలింది. దీనికి గల కారణం మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. తీసుకున్న ఆహారంలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్, సింపుల్ కార్బొహైడ్రేట్స్ గా మారితేనే గ్లూకోజ్ గా తయారవుతుంది. కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ సింపుల్ కార్బొహైడ్రేట్స్ గా మారడానికి అవసరమయ్యే ఆల్ఫా అమైలేజ్ అనే కణాలు గ్లూకోజ్ ని తయారుచేయడంలో ఉపయోగపడుతుంది. అప్పుడు కార్బొహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. కాబట్టి ఈ ఆల్ఫా అమైలేజ్ ని త్రిఫల చూర్ణం తగ్గిస్తుంది. డయాబెటిస్ పేషెంట్స్ ఉదయం, సాయంత్రం ఐదు గ్రాముల చొప్పున త్రిఫల చూర్ణాన్ని వేడి నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి సహకరిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…