Allu Studios : హైదరాబాద్ మరో ఫిలిం స్టూడియోకు వేదికైంది. ఇప్పటికే అగ్ర హీరోలకు చెందిన ఫిలిం స్టూడియోలు ఉండగా.. వాటి సరసన అల్లు ఫ్యామిలీకి చెందిన అల్లు స్టూడియోస్ వచ్చి చేరింది. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ను శనివారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య లాంటి మహా నటుడి పేరిట ఈ స్టూడియోస్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. అందుకు గాను అల్లు అరవింద్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. తన కల నెరవేరిందని అన్నారు. అలాగే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య లాంటి మహా నటుడి పేరిట స్టూడియోస్ నిర్మించడం గొప్ప విషయమన్నారు. ప్రజల ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అల్లు ఫ్యామిలీలో పుట్టినందుకు గర్విస్తున్నానని తెలిపారు. ఇక అల్లు స్టూడియోస్ విషయానికి వస్తే.. దీన్ని 10 ఎకరాల్లో నిర్మించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఈ స్టూడియో ఉంది.
సరిగ్గా ఏడాది కింద ఈ స్టూడియోస్‌కు భూమి పూజ చేశారు. కాగా అక్టోబర్ 1వ తేదీన అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించారు. దాదాపు పది ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులను ఇందులో చేసుకునేలా ప్లాన్ చేశారు. ఇక ఈ స్టూడియోని నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోపాటు ఆయన సోదరులు అల్లు బాబీ (వెంకటేష్), అల్లు శిరీష్‌లు కలిసి నిర్మించారు.
షూటింగ్‌లకు సంబంధించిన బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతో షూటింగ్ లు చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితోపాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే గత కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని వస్తున్న వార్తలకు ఈ రోజు చెక్ పెట్టినట్లు అయింది. అందరూ కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో అవన్నీ పుకార్లే అని స్పష్టమైంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…