Tollywood : గతేడాది అక్టోబర్ మొదటి వారంలో సమంత, నాగచైతన్య ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. వీరి విడాకుల వార్త అప్పట్లో పెను దుమారం రేపింది. అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోయారు. అందుకనే ఇప్పటికీ వారు సమంతను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత జనవరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్ నటుడు ధనుష్ విడాకులు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలా చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో విడాకులు అనేవి సర్వ సాధారణం అయిపోయాయి.
అయితే ఇటీవల మెగాస్టార్ చిన్నకుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉంటున్నారని స్పష్టమైంది. దీంతో ఎప్పుడైనా వీరు విడాకులు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ జంట విడాకులకు అప్లై చేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, ఆయన భార్య రూప విడాకుల కోసం కోర్టులో అప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ నాంపల్లి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

కాగా శ్రీనువైట్ల, రూప ఇద్దరూ గత నాలుగేళ్ల నుంచి విడిగా ఉంటున్నారని తెలిసింది. కనుకనే వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. వీరిమధ్య మనస్ఫర్థలు వస్తుండడం వల్లే వీరు విడిగా ఉంటున్నారని.. ఇక కలవడం సాధ్యపడడం లేదని.. కనుకనే విడాకులకు దరఖాస్తు చేశారని తెలుస్తోంది. ఇక శ్రీను వైట్ల ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి ఢీ అంటే ఢీ నిర్మిస్తున్నారు. ఈయన సినిమాలు వచ్చి చాలా కాలమే అవుతోంది. గతంలో మహేష్ బాబుతో దూకుడు, ఎన్టీఆర్‌తో బాద్ షా వంటి సక్సెస్ ఫుల్ హిట్స్‌ను ఈయన అందించారు. తరువాత ఈయన కెరీర్ కాస్త నెమ్మదించింది. మరి ముందు ముందు అయినా ఈయన మళ్లీ పుంజుకుంటారేమో చూడాలి.