Niharika : సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక ఈ మధ్య కాలంలో తరచూ యాక్టివ్‌గానే ఉంటోంది. తన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె రీసెంట్‌గా తన భర్త చైతన్యతో కలసి జోర్డాన్‌కు ట్రిప్ వేయగా.. అక్కడ తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. అయితే కొంత కాలం పాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన నిహారిక డ్రగ్స్ కేసు అనంతరం కొద్ది రోజులకు మళ్లీ యాక్టివేట్ చేసింది. ఆ తరువాత అందులో తన అప్‌డేట్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది. అందులో భాగంగానే నిహారిక పెడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె అందులో తన ఫొటోషూట్స్ తాలూకు ఫొటోలను షేర్ చేస్తోంది. అయితే గతంలో కన్నా ఆమెను ఇప్పుడే ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆమె డ్రగ్స్ కేసులో అరెస్టు అయిందో అప్పటి నుంచి ఆమెపై ట్రోల్స్ ఎక్కువైపోయాయి. కానీ వాటిని పట్టించుకోనని, కొత్త జీవితం మొదలు పెడతానని ఆమె గతంలోనే చెప్పింది. ఇక తాజాగా మరోమారు నిహారిక ట్రోలింగ్‌కు గురవుతోంది. ఆమె లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫొటోనే అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. అందులో ఆమె గ్లామర్ లేకుండా కాస్త వృద్ధాప్య ఛాయలతో కనిపిస్తోంది. చూస్తుంటే మేకప్‌నే అలా వేశారని అర్థమవుతోంది. కానీ అది ఫెయిలైంది. దీంతో ఆమె ముసలమ్మలా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

నిహారిక తాజాగా షేర్ చేసిన ఫొటోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె వృద్ధురాలిగా మారిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటో వైరల్‌గా మారింది. అయితే ట్రోలింగ్ ఆమెకు కొత్త కాదు. కానీ ఈ విధమైన ట్రోల్స్‌ను ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇక నిహారిక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. గతంలో అనసూయతో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించేందుకు ఈమె ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ ఆ తరువాత దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇక త్వరలోనే ఈమె ఓ టీవీ చానల్‌లో ఓ ట్రావెల్ షో నిర్వహిస్తుందని తెలుస్తోంది. దీనిపై కూడా అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. మరి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.