Tollywood : సాధారణంగా దర్శక నిర్మాతలకు సినిమాను తెరకెక్కించడం ఒకెత్తయితే.. దానికి పబ్లిసిటీ ఇవ్వడం ఒకెత్తు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఎంత గ్రాండ్‌గా నిర్వహిస్తే మూవీ ప్రేక్షకుల్లోకి అంత బాగా వెళ్తుందని నమ్ముతున్నారు. అందుకనే ప్రీ రిలీజ్ వేడుకలను చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ వేడుకలకు దుబాయ్ వైపు చూస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సినిమాలకు చెందిన దర్శక నిర్మాతలు, హీరోలు దుబాయ్‌లో తమ సినిమా ఫంక్షన్లను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో రజనీకాంత్ నటించిన 2.0 చిత్ర వేడుకలను అక్కడే నిర్వహించారు.
ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా దుబాయ్‌లోనే వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో మూవీకి కావల్సినంత పబ్లిసిటీ లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప మూవీని కూడా దుబాయ్‌లోనే ప్రమోట్ చేయాలని, అక్కడే ఈ మూవీకి ఫంక్షన్స్ నిర్వహించాలని బన్నీ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ మొత్తం తమ చిత్ర వేడుకలకు దుబాయ్ వైపు చూస్తోంది. మరి ఆయా మూవీలు బాక్సాఫీస్ వద్ద ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.