Tollywood : సినీ పరిశ్రమ పెద్దలు కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు నేటి నుండి ఏపీలోని థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సినీ పరిశ్రమకు కాస్త ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలు జరపగా, ఎట్టకేలకు దీనిపై సానుకూల స్పందన వచ్చింది.
కొత్త సినిమాలు విడుదల చేస్తే.. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఆందోళన చెందిన సినీ ఇండస్ట్రీకి జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు శర్వానంద్, సిద్ధార్థ్ నటించిన మహా సముద్రం చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన చిత్ర బృందానికి ఆనందం కలిగిస్తోంది. దసరాకు కానుకగా విడుదలవుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలకు లబ్ధి చేకూరుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఏపీలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తాజా ఆదేశాల్లో తెలిపింది. దీంతో సెకండ్ షో సినిమాకు కూడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడవు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…