Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఓ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ దర్శకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. బాలీవుడ్, టాలీవుడ్ దర్శకులకు పోలికలు చెప్పారు. ఇద్దరినీ పోలిస్తూ.. బాలీవుడ్ దర్శకులను ఆయన ఆకాశానికెత్తేశారు. టాలీవుడ్ డైరెక్టర్లు నేరుగా షూటింగ్ సమయంలోనే డైలాగ్స్ రాస్తారని.. బాలీవుడ్ దర్శకులు మాత్రం ముందుగానే డైలాగ్‌లను రెడీ చేసి ఉంచుతారని.. వాటిని నటీనటులు ముందుగానే ప్రాక్టీస్ చేస్తారని.. దీంతో షూటింగ్‌లో బాగా యాక్ట్ చేస్తారని అన్నారు.
అయితే టాలీవుడ్ దర్శకులు సెట్‌లోనే డైలాగ్‌లను రాస్తుండడం వల్ల నటీనటులకు అటు యాక్టింగ్.. ఇటు డైలాగ్‌లపై ఒకే సారి ఫోకస్ పెట్టడం కష్టంగా మారిందని అన్నారు. కనుక తెలుగు దర్శకులు.. హిందీ వారిని చూసి నేర్చుకోవాలని మొట్టికాయలు వేశారు. అయితే ఆయన ఇన్‌డైరెక్ట్‌గా కొరటాలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశారని తెలుస్తోంది. ఇటీవల కొరటాల తెరకెక్కించిన ఆచార్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అప్పటి వరకు ఫ్లాప్‌లు లేని కొరటాల ఇలా చేశారేమిటని మెగా ఫ్యాన్స్ సైతం మండిపడ్డారు. అయితే చిరంజీవి ఆచార్య ఫెయిల్యూర్ మొత్తాన్ని కొరటాలపై నెట్టడం సరికాదని.. తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి చిరంజీవి, పవన్ లాంటి అగ్ర హీరోలు కొందరు సినిమా కథ, షూటింగ్ లలో వేలు పెడతారని.. కనుకనే దర్శకులకు సొంతంగా తీసే స్వేచ్ఛ ఉండదని.. కాబట్టే సినిమాలు చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయని అంటున్నారు.
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు దర్శకులకు బాగా స్వేచ్ఛను ఇస్తారని.. అందుకనే వారితో దర్శకులు సినిమాలు చేయాలంటే ఆసక్తిని చూపిస్తారని.. కానీ చిరు, ఆయన ఫ్యామిలీ హీరోలతో సినిమాలు తీయాలంటేనే దర్శకులు భయపడతారని అంటున్నారు. ఆచార్య విషయంలో కొరటాలను దోషిగా చూడడం మానుకోవాలని చిరంజీవికి నెటిజన్లు హితవు చెబుతున్నారు. అయితే టాలీవుడ్ దర్శకులపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మాత్రం వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయట. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
అయిపోయిన సమస్యను మళ్లీ పైకి తెచ్చి అవనసరంగా విమర్శలపాలు కావడం దేనికని చిరంజీవిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక కొరటాల ఎన్‌టీఆర్ మూవీతో సక్సెస్ సాధించి తనను నిందించిన వాళ్లకు బుద్ధి చెప్పాలని కొందరు కొరటాలకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి కొరటాల ఏం చేస్తారో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…