Nithya Menen : నిత్య మీనన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గ్లామర్ రోల్స్ చేయకపోయినా తన నటనతో ఈమె కట్టి పడేస్తుంది. ఇక తన సినిమాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. నిత్య మీనన్‌ది యాక్టింగ్‌లో భిన్నశైలి అని చెప్పవచ్చు. ప్రేమ సంబంధమైన క్యారెక్టర్‌లో అయితే ఎంతో అద్భుతంగా నటిస్తుంది. అలాంటి చిత్రాలు హిట్ కూడా అయ్యాయి. ఇక చివరిసారిగా ఈమె భీమ్లా నాయక్‌లో నటించింది. అయితే ఈమెకు టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అయినప్పటికీ ఇతర భాషలకు చెందిన చిత్రాల్లో నటిస్తోంది.
ఇక నిత్య మీనన్ ఉన్నట్లుండి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తన సినిమా కెరీర్‌కు బ్రేక్ వేస్తున్నట్లు చెప్పింది. సినిమాల్లో కొంత కాలం పాటు నటించబోనని స్పష్టం చేసింది. సినిమా షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నానని చెప్పింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈమె అభిమానులతో ముచ్చటిస్తూ.. ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే తాత్కాలికమే అయినప్పటికీ ఈమె తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు షాకవుతున్నారు. సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని కోరుతున్నారు.
తాను గత కొంత కాలంగా నిరంతరాయంగా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ అలసిపోయానని. అందుకనే రిలాక్స్ అవడం కోసం తాత్కాలికంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని తెలియజేసింది. అయితే నిత్య అభిమానులు మాత్రం ఆమె నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు. అయితే ఒక్కసారి సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణించడం కష్టమే. అందుకు ఎంతో లక్ ఉండాలి. మరి నిత్య మీనన్‌కు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…