Spinach : మనం తరచూ ఆహారంలో భాగంగా ఆకుకూరలను కూడా తీసుకుంటూ ఉంటాం. వారానికి రెండు సార్లైనా తప్పకుండా ఆకుకూరలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు ఎక్కువగా ఐరన్ ను కలిగి ఉంటాయి. ఐరన్ లోపం కారణంగా మనకు రక్త హీనత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీలు, పిల్లలు ఎక్కువగా రక్తహీనత సమస్య బారినపడుతూ ఉంటారు. వీరు తరచూ ఆకు కూరలను తినడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఆకుకూరల్లో పాలకూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
పాలకూరను మితంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూర మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూరలో పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. దీని వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. అలాగే పాలకూరలో శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
పాలకూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. భావోద్వేగాలు అదుపులో ఉండడంతోపాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఉంది. దీనిలో పుష్కలంగా ఉండే ఐరన్ రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బీపీని నియంత్రించడంలో పాలకూర మనకు సహాయపడుతుంది. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారు పాలకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపును తగ్గిస్తాయి. పాలకూరను తినడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. పాలకూరతో మనం పప్పును, పకోడీలు, పాలక్ రైస్, వేపుడు, పాలక్ పనీర్ వంటి వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఆకుకూరలను వండేటప్పుడు వాటిని ఎక్కువగా ఉడికించరాదు. ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిల్లో పోషకాలు ఆవిరైపోతాయి. కనుక ఆకుకూరలు తక్కువగా ఉడికించాలి. పాలకూరలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. కనుక మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు పాలకూరను మితంగా తీసుకోవాలి లేదా వారు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా పాలకూర మనకు ఎంతో ఉపయోగపడుతుందని.. దీనిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…