Tollywood : భారతీయ సినిమా ప్రేక్షకులను అలరించడానికి అన్ని భాషలకు చెందిన చిత్ర పరిశ్రమలు కఠోరంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్‌లలో గ్రాఫిక్స్ పరంగా ఒక రేంజ్ సినిమాలు వస్తున్నాయి. అయితే అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ ఎవరూ కూడా హాలీవుడ్ స్థాయిలో చక్కని గ్రాఫిక్స్‌ను అందించలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏమిటంటే..

పైన ఇచ్చిన రెండు చిత్రాలను చూశారు కదా. మొదటి చిత్రం మీకు తెలుసు. బాహుబలి లోనిది. అయితే రెండో ఫొటో ఏదైనా మూవీలోదా ? అని చాలా మందికి సందేహం కలుగుతుంది. కానీ అది మూవీ కాదు. ఒక హాలీవుడ్ సిరీస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని అప్పట్లో చాలా పాపులర్ అయిన సిరీస్. అది ఒక సిరీస్ అయినప్పటికీ సినిమాను మించిన గ్రాఫిక్స్ ఉంటాయి. అద్భుతమైన విజువల్ వండర్ సిరీస్ అది.
అయితే ఈ రెండు చిత్రాలను చూస్తే మీకు కచ్చితంగా కింద ఇచ్చిన చిత్రంలోని గ్రాఫిక్స్ బాగున్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే అందులో లైటింగ్ కానీ, చిత్రంలోని డిటెయిల్స్ కానీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక ఇంకో రెండు చిత్రాలను పరిశీలిద్దాం. మొదటిది టామ్ క్రూజ్ అనే హాలీవుడ్ హీరో నటించిన మిషన్ ఇంపాజిబుల్ లేటెస్ట్ చిత్రంలోని సన్నివేశం. కిందది మహేష్ బాబుకు చెందిన వన్ మూవీలోనిది. ఈ రెండు ఫొటోలను చూసినా మీకు ఇట్టే అర్థమవుతుంది. ఎందో గ్రాఫిక్స్ క్లీన్ గా ఉన్నాయో. ఇదీ.. హాలీవుడ్‌కు, మన సినీ ఇండస్ట్రీలకు ఉన్న తేడా. వారు చాలా స్పష్టమైన డిటెయిల్స్‌తో సినిమాలను తీస్తారు. కానీ మనవాళ్లు దాని జోలికిపోరు. అందుకు కూడా కారణం ఉంది.

హాలీవుడ్ అంటే ప్రపంచ స్థాయి మార్కెట్. కనుక బడ్జెట్, వసూళ్లు కూడా భారీగానే ఉంటాయి. కనుక వారు చాలా ఆలస్యమైనా నాణ్యమైన సినిమాలు తీస్తారు. ఒక ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఎప్పుడూ ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉంటుంది. వారు ఒక మూవీ చేశాక ఇంకో మూవీ చేద్దామనే నియమం పెట్టుకోరు. కనుక వారి మూవీలు ఎప్పుడూ రిలీజ్ అవుతూనే ఉంటాయి. దీంతో వారు ఆలస్యంగా సినిమాలు తీసినా ఎప్పుడూ ఏదో ఒకటి రిలీజ్ అవుతూనే ఉంటుంది కనుక నష్టాలు అన్న మాట రాదు. అందువల్ల వారు చాలా ఆలస్యంగానైనా సరే.. అద్భుతమైన గ్రాఫిక్స్ వచ్చేలా మూవీలను తీస్తారు. పైన ఇచ్చిన చిత్రాలను చూస్తే మీకది అర్థమవుతుంది.
Tollywood : త్వరగా షూటింగ్‌లను ముగించేస్తారు..
ఇక మన దగ్గర ఒక నిర్మాత ఒకేసారి రెండు, మూడు మూవీలను తీయరు. ఒకటి అయ్యాక మరొకటి తీస్తారు. దీంతో మూవీలను వేగంగా షూట్ చేసి త్వరగా విడుదల చేయాలని వారు భావిస్తుంటారు. లేదంటే అప్పు తీసుకున్న డబ్బుకు వడ్డీలు చాలా అవుతాయి. దీంతో ఆలస్యంగా సినిమా విడుదల అయితే అప్పుడు చాలా నష్టాలు వస్తాయి. కనుక వేగంగా సినిమాలకు షూటింగ్‌లను కానిచ్చేస్తుంటారు. అలాగే గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తారు. దీంతో నాణ్యత లోపిస్తుంది. గ్రాఫిక్స్‌ను నామమాత్రపు క్వాలిటీతో రెండర్ చేస్తారు. ఎక్కువ సమయం కేటాయించరు. దీంతో గ్రాఫిక్స్ ఒక మోస్తరుగా వస్తాయి. కానీ హాలీవుడ్ లెవల్‌లో రావు.
అయితే మన వాళ్ల దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నా.. దాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఒకేసారి రెండు మూవీలను ప్లాన్ చేసి ఎప్పుడూ మార్కెట్‌లో ఒక మూవీ విడుదల అయ్యేలా చూసుకుంటే.. దాంతో నష్టాలు రావు. ఆలస్యంగా సినిమాను విడుదల చేసినా.. అద్భుతమైన గ్రాఫిక్స్, నాణ్యతతో మూవీలను తీసి విడుదల చేస్తే పైన ఇచ్చిన హాలీవుడ్ చిత్రాల్లో మాదిరిగా మూవీలు అద్భుతంగా వస్తాయి. దీంతో లాభాలు కూడా వస్తాయి. మరి ఆ బాటలో మన సినీ ఇండస్ట్రీ వర్గాలు ప్రయాణిస్తాయో, లేదో చూడాలి.