Republic Movie Review : మెగా హీరో సాయి ధరమ్ తేజ్, దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలను పెట్టుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక పోతే ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో లు అమెరికా వంటి దేశాలలో పడ్డాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలనే సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

సినిమా ఎలా ఉంది ? అనే విషయానికి వస్తే.. తేల్లేరుకి సంబంధించిన ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో రిపబ్లిక్ చిత్రం ప్రారంభం అవుతుంది. తేజ్ ఇంట్రడక్షన్ చాలా సింపుల్ గా చూపించారు. ఇందులో సాయి తేజ్ కాలేజీ విద్యార్థిగా, ఒక నిజాయితీ గల వ్యక్తిగా, ఒక ఐఏఎస్ అధికారి కావాలని ఎన్నో కలలు కంటాడు. ఇలాంటి సమయంలోనే ఫారెన్ యువతిగా నటించిన ఐశ్వర్య రాజేష్ ని చూసి ప్రేమలో పడతాడు.
Republic is @devakatta s new Prasthanam. I’m just mind blown at what I saw last night🙏🏼 @IamSaiDharamTej best ever. #Republic is beyond politics & a journey everyone needs to experience. I’m hungover & waiting to hear frm you all. @aishu_dil 🙇♀️ @meramyakrishnan 🙏🏼@IamJagguBhai 🙏🏼 pic.twitter.com/JQdI3pYVo3
— Smita (@smitapop) September 30, 2021
ఇక నెగిటివ్ పాత్రలో రమ్యకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. కొత్తగా ఎన్నికైన రూలింగ్ పార్టీ అధినేతగా రమ్యకృష్ణను ఇందులో చూపించారు. ఇలా సినిమా మొదటి హాఫ్ ఎంతో ఆసక్తికరంగా, అద్భుతంగా కొనసాగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడు దేవా కట్టా కనిపిస్తారని చెప్పవచ్చు. ఇక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత సాయి తేజ్ పాత్ర మరింత ఊపందుకుంటుంది. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ, సాయి తేజ్ మధ్య గొడవ ఎలా మొదలైంది ? ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథ.
#Republic
First half is Amazing.
I can see @devakatta in every scene.
Not even a single unnecessary scene pic.twitter.com/3AAJDBoyvL— Pradyumna (@pradyumna257) October 1, 2021
మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా కొనసాగింది. ఇందులో రమ్యకృష్ణ, సాయి తేజ్ ఫర్ఫార్మెన్స్ లను ఉపయోగించుకుంటూ దర్శకుడు దేవా కట్టా తన మార్క్ చూపించారు. సెకండ్ హాఫ్ లో కూడా పవర్ ఫుల్ సన్నివేశాలు బాగా ఉన్నాయి. అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ కి కూడా బాగా మంచి పాత్ర దక్కిందని చెప్పవచ్చు. ఈ సన్నివేశాలకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరిందని చెప్పవచ్చు.సెకండ్ హాఫ్ లో కథ కాస్త తడబాటుకు గురికావడం మైనస్ అని అంటున్నారు. మొత్తగా రిపబ్లిక్ చిత్రం మల్టిఫ్లెక్స్ లలో వర్కౌట్ అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి.