Tollywood : దీపావళి పండుగ అంటే చీకట్లని పారద్రోలి వెలుగులను నింపే పండుగగా అందరూ భావిస్తుంటారు. ఈ వేడుక రోజు చిన్నాపెద్దా బాణసంచా కాలుస్తూ పండగ జరుపుకుంటూ ఉంటారు. అయితే క్రాకర్స్ కాల్చడం పాత పద్దతని కొందరంటే.. వీటి వల్ల డబ్బు వృథా అని ఇంకొందరు.. మరికొందరైతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి మరీ ప్రచారం చేశారు. సెలబ్రిటీలు అయితే ఎకో ఫ్రెండ్లీ వేడుక జరుపుకోవాలంటూ సూచిస్తున్నారు.
ఘట్టమనేని ఫ్యామిలీ ఇంటిని దీపాలతో అందంగా అలంకరించుకుంది. ఇల్లు దేదీప్యమానంగా వెలిగిపోతుండగా, తాము ఎకో ఫ్రెండ్లీ వేడుకలను జరుపుకుంటున్నట్టు తెలియజేశారు. ఘట్టమనేని ఇంటికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
మెగా ఫ్యామిలీ కూడా దీపావళి పండుగని గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తోపాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి పండుగ వేడుకులను ఘనంగా సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులందరికీ ‘హ్యాపీ దీపావళి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/baraju_SuperHit/status/1456170245782052864?s=20