Namrata Shirodkar : స్టార్ హీరోల మధ్య స్నేహం ఎప్పుడూ తమ తమ అభిమానులకు తీయని సందర్భంగానే ఉంటుంది. ఇద్దరు స్టార్స్ కలుసుకున్న, మాట్లాడుకున్నా చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. హీరోల భార్యలు కూడా ఈ రిలేషన్ బలపడేలా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, పండుగల వేళ ఒకరినొకరు విష్ చేసుకోవడం లాంటివి చేస్తుండడం ఇటీవల బాగా గమనిస్తున్నాం.
ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనోవా ఓ గిఫ్ట్ పంపించారు. మహేష్ బాబు ఫ్యూచర్, ఫ్యామిలీ క్షేమం కోరుతూ క్రిస్మస్ కానుకగా చాక్లెట్లు నిండిన ఒక స్పెషల్ బాక్స్ పంపించారు అన్నా లెజనోవా. ఇందులో మీ గురించి హృదయపూర్వకంగా ఆలోచిస్తూ, ఈ పవిత్రమైన సీజన్‌లో సున్నితమైన అద్భుతాల ద్వారా మీరు బాగుండాలని, ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నట్లు కోరుకుంటున్నాను. అన్నా, కళ్యాణ్” అని ప్రత్యేకమైన నోట్‌లో రాసి ఉంది.
ఇక దీపావళి సందర్భంగా కూడా మహేష్ ఫ్యామిలీకి స్పెషల్ గిఫ్ట్ వెళ్లినట్టు తెలుస్తోంది. నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా, కళ్యాణ్ నుండి వచ్చిన పోస్ట్‌కి సంబంధించిన ఫొటో షేర్ చేసింది. ఇందుకు గాను అన్నాకు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ నమ్రత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులు తెగ సంబరపడుతూ ఇద్దరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నారు.