Karthikeya 2 : నిఖిల్ సిద్దార్థ్ – చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే కార్తికేయ 2. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలిరోజు లిమిటెడ్ స్క్రీన్‌లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్‌డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళను సాధించింది.
అయితే ఇటీవల హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. కార్తికేయ 2 సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారని, సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని బలవంతం చేశారంటూ ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్ ఇలా అనడంతో ఇండస్ట్రీలోని వారంతా షాక్ అయ్యారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది కార్తికేయ 2. దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే కార్తికేయ 2 ఆపడానికి ప్రయత్నించింది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అక్కినేని నాగార్జున, హీరో నితిన్.. నిఖిల్ సినిమాను తొక్కేయడానికి ప్రయత్నించారు అంటూ అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమా రిలీజ్ చేద్దామనుకున్న టైంకి హీరో నితిన్ తన మాచర్ల నియోజకవర్గంను రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ ఇద్దరు హీరోలే నిఖిల్ సినిమాని కావాలని ఆపడానికి ట్రై చేశారని.. నిఖిల్ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి ముందే తెలిసి కార్తికేయ 2ని పోస్ట్ పోన్ చేసుకోమన్నారు.. అంటూ నాగార్జునను, హీరో నితిన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నిఖిల్ అభిమానులు. అయితే దీనిపై ఆయా హీరోలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…