Dance : ఆమె స్టెప్పులకు దద్దరిల్లిపోయిన శ్రీదేవి డ్రామా కంపెనీ.. డాన్సర్‌గా మారిన బస్ కండక్టర్ రియల్ లైఫ్ స్టోరీ..

Dance : టెలివిజన్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో గురించి తెలిసిందే. వారం వారం ఎంటర్ టైన్‌మెంట్‌ ను పెంచుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయింది. ఆ ప్రోమోలో పల్సర్ బైక్ పాటతో ఎంట్రీ ఇచ్చింది గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ. ఆమె స్టేజీ రాగానే APSRTC లో పని చేస్తాను అని చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది.

సింహాచలం దగ్గరలోని ప్రహ్లాదపురంలో బాబు విద్యానికేతన్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే డాన్స్‌పై ఉన్న ఆసక్తితో రోజు ప్రాక్టీస్‌ చేసేవారు. టెన్త్‌ క్లాస్‌ అర్హత మీద ఆర్టీసీలో ఉద్యోగవకాశాలు ఉన్నాయని.. అమ్మ, తమ్ముడు చెప్పడంతో దానికి దరఖాస్తు చేసుకుంది. 2011లో ఝాన్సీకి జాబ్ వచ్చింది. ఆ ఏడాదే ట్రైనింగ్‌ కంప్లీట్‌ చేసి.. 2012లో గాజువాక ఆర్టీసీ డిపోలో ఉద్యోగంలో జాయిన్ అయింది. అయితే జాబ్‌ వచ్చినా కూడా డాన్స్‌ మీద ఉన్న ఇష్టంతో అక్కడక్కడా డాన్స్‌ ప్రొగ్రామ్స్‌ చేస్తూనే ఉండేది.

Dance

అలాగే కొన్ని టీవీ ఛానల్స్‌లోనూ తన నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. జెమినీ టీవీ డాన్సింగ్ స్టార్ ప్రొగ్రామ్‌లోనూ పోటీ చేసింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్‌ అందుకుంది. అప్పుడు అంతా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అలా ప్రారంభమైన ఝాన్సీ ప్రయాణం తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. పదేళ్ల క్రితం మాటీవీలో రంగం 2 అనే కార్యక్రమంలోనూ, జీ తెలుగులో వచ్చిన తీన్మార్ అనే కార్యక్రమంలో డాన్సర్‌గా చేసింది. ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన డాన్స్‌తో మరో లెవల్‌కు వెళ్లిపోయింది.

కొత్త సినిమాలోని పల్సర్ బైక్ సాంగ్‌కు ఊర మాస్‌ స్టెప్పులేసి ఇరగదీసింది. అక్కడ ఉన్న జడ్జి ఆమనితోపాటు యాంకర్ రష్మీ, హైపర్ ఆది, రాంప్రసాద్ ఇలా స్టేజిపై ఉన్న వాళ్లంతా ఆమెతో కలిసి స్టెప్పులేయడంతో స్టేజీ దద్దరిల్లింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాజువాక లేడీ కండక్టర్ డ్యాన్స్ న్యూసే ట్రెండింగ్‌లో ఉంది. ఇంక నెటిజన్లు కొందరు పనిలో పనిగా ఆమె పాత డాన్స్‌ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. అయితే ఝాన్సీ ఇంటర్ ఫస్టియర్ లో ఉన్నప్పుడే లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన భర్త కూడా ఒక డాన్సరే. నేను చేసిన ప్రతి టీవీ ప్రోగ్రాంలో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా నా హస్బెండ్ ఉంటారు అని చెప్పుకొచ్చింది ఝాన్సీ.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM