Vijay Devarakonda : పెళ్లిచూపులు సినిమాతో అరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ, కొన్నేళ్లుగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకోవడమే కాకుండా చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరితోనూ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ టాప్ సౌత్ హీరోలలో ఒకడయ్యాడు. కొన్ని కారణాల వల్ల విజయ్ తో పనిచేసిన నిర్మాతలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఆంధ్ర హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత, పంపిణీదారు అభిషేక్ నామా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో విజయ్ దేవరకొండ ప్రవర్తనతో విసుగు చెందడం జరిగింది అంటూ ఓ సందర్భంలో వెల్లడించారు.
అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ కి ఇండస్ట్రీ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. విజయ్ కి ఇండస్ట్రీలో మార్కెట్ పెరగడం వల్ల వరల్డ్ ఫేమస్ లవర్ కి లాభాలు వస్తాయని నమ్మి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా రాలేదు. ఒక హీరో చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకుని హీరో తగిన విధంగా స్పందించాలి. కానీ ఆ సమయంలో విజయ్ ఆ విధంగా చేయలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు.
ఇలా బాధ్యతారహితంగా ఉంటే ఎలా.. ఈ ఒక్క సినిమాతోనే అయిపోదు. కనీసం నష్టపోయిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు సహాయం చేయకపోయినా.. తర్వాత వచ్చే చిత్రం డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా హామీ ఇవ్వలేదు. ఒక సినిమాని డిస్ట్రిబ్యూటర్లు కొనాలి అంటే అది ఆ హీరో పైన, ఆ సినిమా తీసే డైరెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. ఇలా విజయ్ దేవరకొండ లాగా బాధ్యతారహితంగా ఉంటే తర్వాత చిత్రాన్ని కొనడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు భయపడతారు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ప్రభుత్వం కూడా ఏ సహాయం చేయలేదు. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక జూదం లాంటిది అంటూ వారు ఎదుర్కొనే సమస్యలను వెల్లడించారు అభిషేక్ నామా.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…