Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తోంది. ప్రస్తుతం సమంత ముంబైకు షిఫ్ట్ అయ్యేందుకు ఇల్లు కొనుక్కోవడంలో బిజీ అయ్యింది. ఈ ఇంటికి కూడా ఎన్నో కండిషన్స్ పెట్టేసింది. ఇక టాలీవుడ్ లో సమంత ఎండార్స్ మెంట్స్ ను మేనేజర్లు చూసుకుంటున్నారు. అలాగే ముంబైలో కాస్టింగ్ అండ్ ఆర్టిస్ట్ మేనేజ్ మెంట్ తో వ్యవహరించే ఏజెన్సీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్లు టాప్ హీరోయిన్స్ కు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తుంటారు.
ఈ క్రమంలో కొత్తగా బాలీవుడ్ కనెక్షన్ కోసం ఓ కార్పొరేట్ కంపెనీతో ఓ ఏజెన్సీ ద్వారా ఇప్పుడు సామ్ సైన్ అప్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సమంత ఇంత పెద్ద బ్రాండ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది.. బాలీవుడ్ లో ఆమెను రకరకాల ప్రచారాల్లో నిలబెట్టడం వరకు.. ఈ ఏజెన్సీ హ్యాండిల్ చేస్తుందట. అదే సమయంలో వారి గేమ్ లో బెస్ట్ గా ఉన్న వాళ్లను.. కొంత మంది టాప్ ప్రొడ్యూసర్లు, దర్శకులను కలిసేందుకు కూడా ఈ ఏజెన్సీ ఆమెకు హెల్ప్ చేస్తుందన్నమాట. అలా సమంత బాలీవుడ్ లో అతి త్వరలోనే రెండు భారీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
సమంత స్టార్ డమ్ ఇక బాలీవుడ్ లోనూ హల్ చల్ అవుతుందని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రజంట్ సమంత.. శాకుంతలం, యశోద అనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్ లో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా కాతు వాక్కుల రెండు కాదల్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. నెక్ట్స్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది.
దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాలనుకునే వారి కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. గతంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడేవారు. కానీ…
ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ జాబ్స్ మీకోసమే అని చెప్పవచ్చు. ఒరాకిల్ కంపెనీ పలు…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే టెక్ మహీంద్రా కంపెనీ మీకు సదవకాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థలో ఖాళీగా ఉన్న…
యూకో బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇదొక శుభవార్త అనే చెప్పాలి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన…
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…