Tamanna Simhadri : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాడిసన్ బ్లూ పబ్ కేస్ సెన్సేషన్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మింక్ పంబ్ లో సాగిన రేవ్ పార్టీలో అనుమానితుల లిస్ట్ లో హీరోయిన్, మెగా డాటర్ నిహారిక కొణిదెల ఉండటం సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు నిహారికకు సపోర్ట్ గా నిలిచారు. ఆమెపై మీడియా పెట్టిన అధిక దృష్టిని తప్పు పడుతున్నారు. పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ ను తీసుకు వచ్చి, బయటకు తీసుకెళ్లిన తీరు మీడియాలో రిపీటెడ్ చూపించడం, ఆమె పేరును తీవ్ర స్థాయిలో హైలెట్ చేయడం ఆమెకు, ఆమె కుటుంబానికి తీవ్రమైన ఆవేదన కలిగించింది.
నిజానికి మీడియాకు.. పోలీసులు రిలీజ్ చేసిన లిస్ట్ లో నిహారిక పేరు లేదు. ఆ తర్వాత నంబర్ 36 గా నిహారిక పేరును చేర్చారు. ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోకపోయినా.. దానికి సంబంధించిన ఆధారాలు లేకున్నా.. ఆమె కూడా డ్రగ్స్ లిస్ట్ లో ఉందంటూ టార్గెట్ చేశారు. ఇది ఎంతమాత్రం సరైనది కాదని, అలా ఎలా నిహారికను హైలెట్ చేస్తారని, పార్టీకి హాజరు కావడం.. పబ్ కు వెళ్లడం నేరమా అని ట్రాన్స్ జెండర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి ప్రశ్నించారు.
ఈ క్రమంలో తమన్నా.. నిహారికకు ఎంతో సపోర్టివ్ గా నిలిచారు. ఒకరిద్దరు డ్రగ్స్ తీసుకుని పార్టీకి వెళితే.. అక్కడికి వెళ్లిన వారందర్నీ ఎలా దోషులుగా చూస్తారని ప్రశ్నించారు. నిహారిక తన ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు వెళ్లిందని, ఆమె ఒక సెలెబ్రిటీ కావడం వల్లే మీడియా తనను ఫోకస్ చేసిందని అన్నారు. అంతేకాకుండా మీడియాలో నిహారిక మాత్రమే పెద్ద నేరం చేసినట్లు చూపిస్తున్నారని, యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఆమెను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అన్నారు. మెగా ఫ్యామిలీని ఉద్ధేశ్యపూర్వకంగానే ఇలా టార్గెట్ చేస్తున్నారని తమన్నా మండిపడ్డారు. మెగా ఫ్యామిలీపై ఇలాంటి దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…