Samantha : నాగ‌చైత‌న్య‌, అఖిల్‌తో స‌మంత ఢీ అంటే ఢీ..!

Samantha : ఒక‌ప్పుడు అక్కినేని ఫ్యామిలీగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న స‌మంత గ‌త ఏడాది అక్టోబర్ 2న చైతూకి విడాకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత సోలో లైఫ్ గ‌డుపుతోంది. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఓకే చేస్తూ షూటింగ్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలో పాన్ ఇండియా సినిమా యశోద ఒకటి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా యశోద తెరకెక్కుతోంది. యశోద సినిమా 12 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

Samantha

అయితే ఇప్పుడు ఈ డేట్ కి అనౌన్స్ చేయడం ప్రాబ్లంగా మారింది. నెటిజన్లు, మీమర్స్ ఈ డేట్ గురించి మరో రెండు సినిమాలని కంపేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీనికి కారణం నాగ చైతన్య, అఖిల్ సినిమాలు కూడా అప్పుడే ఉండడ‌మే. మాజీ క‌పుల్ వ్య‌క్తిగ‌త‌, వృతిప‌ర‌మైన ప‌నుల‌తో బిజీ అయ్యారు. ఇపుడు ఎవ‌రూ ఊహించ‌ని ఇంట్రెస్టింగ్ డెవ‌ల‌ప్ మెంట్ ఒక‌టి లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. చైతూ, సామ్ తొలిసారి నువ్వా నేనా.. అన్న‌ట్టుగా బాక్సాపీస్ వ‌ద్ద పోటీ ప‌డబోతున్నారు. నాగ‌చైత‌న్య తొలి హిందీ చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా. అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీలో చైతూ కీ రోల్ పోషిస్తున్నాడు.

ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌ల కాబోతుంది. మ‌రోవైపు స‌మంత పాన్ ఇండియా ఫీమేల్ సెంట్రిక్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా య‌శోద‌ ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇంట్రెస్టింగ్ విష‌య‌మేంటంటే అఖిల్ న‌టిస్తోన్న స్పై థ్రిల్ల‌ర్ ఏజెంట్ కూడా ఆగ‌స్టు 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించేశారు. అంటే కావాల‌నే స‌మంత త‌న సినిమాని ఆగ‌స్ట్ 12న విడుదల చేసేందుకు సిద్ద‌మైందా అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM