Samantha : ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత ఏడాది అక్టోబర్ 2న చైతూకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత సోలో లైఫ్ గడుపుతోంది. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఓకే చేస్తూ షూటింగ్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలో పాన్ ఇండియా సినిమా యశోద ఒకటి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా యశోద తెరకెక్కుతోంది. యశోద సినిమా 12 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఇప్పుడు ఈ డేట్ కి అనౌన్స్ చేయడం ప్రాబ్లంగా మారింది. నెటిజన్లు, మీమర్స్ ఈ డేట్ గురించి మరో రెండు సినిమాలని కంపేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీనికి కారణం నాగ చైతన్య, అఖిల్ సినిమాలు కూడా అప్పుడే ఉండడమే. మాజీ కపుల్ వ్యక్తిగత, వృతిపరమైన పనులతో బిజీ అయ్యారు. ఇపుడు ఎవరూ ఊహించని ఇంట్రెస్టింగ్ డెవలప్ మెంట్ ఒకటి లైమ్ లైట్‌లోకి వచ్చింది. చైతూ, సామ్ తొలిసారి నువ్వా నేనా.. అన్నట్టుగా బాక్సాపీస్ వద్ద పోటీ పడబోతున్నారు. నాగచైతన్య తొలి హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దా. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో చైతూ కీ రోల్ పోషిస్తున్నాడు.
ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతుంది. మరోవైపు సమంత పాన్ ఇండియా ఫీమేల్ సెంట్రిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా యశోద ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అఖిల్ నటిస్తోన్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ కూడా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించేశారు. అంటే కావాలనే సమంత తన సినిమాని ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు సిద్దమైందా అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది.