Thippatheega : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

Thippatheega : తిప్పతీగ అనే మొక్కను మనకు ఎక్కువగా పల్లెటూరిలో కనిపిస్తుంది. తిప్పతీగను సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా చెట్లుపైకి పాకుతూ ఎదుగుతాయి. చూడడానికి తమలపాకు ఆకారంలో దీని ఆకులు ఉంటాయి. తిప్పతీగ రుచికి వగరుగా చేదుగా కారంగా అనిపిస్తుంది. నమిలితే నోటికి జిగటగా తగులుతుంది. కరోనా విజృంభించిన సమయంలో తిప్పతీగ అనే మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఉందని చాలామందికి తెలిసింది. అప్పటి నుంచి తిప్పతీగను ఆయుర్వేద మందుగా చాలామంది వ్యాధులు నయం చేసుకోవడం కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు.

ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగ ఆకులు, కాండం మరియు కొమ్మలు ఈ మూడు భాగాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. అయితే తిప్పతీగ యొక్క కాండం, కొమ్మలను వ్యాధుల చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. తిప్పతీగ మార్కెట్ లో పొడి రూపంలోనూ, చూర్ణం రూపంలోనూ మనకు లభిస్తుంది.  తిప్ప తీగలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి.

Thippatheega

తిప్పతీగ జ్వరం, ఎసిడిటీ, కామెర్లు, కీళ్లనొప్పులు, మధుమేహం,మలబద్ధకం,అజీర్ణం,మూత్ర సంబంధ వ్యాధులు మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. వాత పిత్త కఫ దోషాలను నియంత్రించడంలో మంచి మందుగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, అజీర్ణ వ్యాధులతో పాటు, ఆస్తమా మరియు దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా తిప్పతీగ చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది.

సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్స్  నుంచి రక్షణ కల్పిస్తుంది. తిప్పతీగలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.  తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. అదేవిధంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్  స్థాయిలను తగ్గించుకోవచ్చు.

దగ్గు,జలుబు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది. ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం మంచి ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులు తిప్పతీగ చూర్ణాన్ని తినడం ద్వారా అనేక లాభాలు చేకూరుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకొని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధ నుంచి బయటపడవచ్చు. ఆ పాలలో కొద్దిగా బెల్లం కలుపుకొని కూడా తాగవచ్చు. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు దరినివ్వదు. ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమల, ముడతలు రాకుండా చేయగల గుణాలు ఈ తిప్పతీగలో సమృద్ధిగా  ఉన్నాయి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM