Simha Movie : నందమూరి బాలకృష్ణ అంటేనే ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. గతంలో ఆయన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన అనేక మూవీలు హిట్ అయ్యాయి. అయితే అదే కోవలో వచ్చింది సింహా మూవీ. కానీ ఇందులో ఇతర ఫ్యాక్షన్ సినిమాల్లో మాదిరిగా సుమోలతో ఛేజింగ్‌లు లేవు. తొడలు కొట్టడాలు కూడా లేవు. ఫ్యాక్షన్ మూవీ అంటే ఇలా కూడా తీయవచ్చు అని దర్శకుడు బోయపాటి శ్రీను సింహా మూవీని వెరైటీగా తీశారు. దీంతో ఆయన శైలి ప్రేక్షకులకు నచ్చింది. సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా సింహా మూవీ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.
2004 నుంచి 2010 వరకు బాలయ్య వరుసగా చేసిన 7 మూవీలు ఫ్లాప్ అయ్యాయి. విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు.. ఇలా 7 సినిమాలు తీశాక 2010లో వచ్చింది సింహా మూవీ. దీనికి బోయపాటి శ్రీను దర్శకుడు. అప్పటికే ఆయన ఎన్నో మూవీలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. బాలయ్యతో సింహా మూవీ మొదటిసారి తీయడం. అయినప్పటికీ బోయపాటిపై బాలయ్య నమ్మకం ఉంచారు. ఈ క్రమంలోనే వినూత్న తరహాలో ఆయన సీన్లను తెరకెక్కించారు. ముఖ్యంగా బాలయ్య తన డైలాగ్‌లతోనే ప్రత్యర్థులను భయపెట్టడం, దుర్మార్గులను విచక్షణా రహితంగా శిక్షించడం.. వంటి అంశాలు ప్రేక్షకులు నచ్చడంతోపాటు కొత్తగా అనిపించాయి. దీంతో సినిమా ఊహించని రీతిలో హిట్ అయింది.
ఇక ఈ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో యాక్ట్ చేశారు. రెండు పాత్రల్లోనూ ఆయన అదరగొట్టేశారు. నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీకి గాను రూ.18 కోట్లు పెట్టుబడి పెట్టగా ఏకంగా రూ.31 కోట్ల షేర్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ మూవీతో వచ్చిన ఆర్యన్ రాజేష్ బురిడీ, శర్వానంద్ ప్రస్థానం, ప్రభాస్ డార్లింగ్, 1940 ఒక గ్రామం, రామ రామ కృష్ణ కృష్ణ వంటి మూవీలు సింహా ప్రభంజనం ముందు నిలబడలేకపోయాయి. అయితే వాటిల్లో ప్రభాస్ డార్లింగ్ మూవీ కాస్త ఫర్వాలేదనిపించింది. ఇక ఈ మూవీకి గాను బాలయ్యకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు రాగా, ఝాన్సీకి ఉత్తమ హాస్యనటిగా, చక్రికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డులు వచ్చాయి. ఇలా సింహా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. ఈ మూవీతో బాలయ్య కెరీర్ మళ్లీ ఉన్నత స్థాయికి చేరుకుంది. తరువాత ఆయన నటించిన అనేక మూవీలు హిట్ అయ్యాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…