MCA Movie Vijay Varma : నాచురల్ స్టార్ గా తిరిగిలేని ఇమేజ్ ని సంపాదించుకున్నాడు నాని. వైవిధ్యమైన కథల కంటే తన ఇమేజ్ కు తగ్గట్టు పాత్రతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఈ తరం హీరోలలో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారు ఎవరు అంటే అది నానినే అని చెపుతారు. నాని నటించే సినిమాల్లో దాదాపుగా అన్ని పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. నాని తన పాత్రతో పాటు మిగతా పాత్రలు కూడా బలంగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతారు. అదే సక్సెస్ ఫార్ములా ను ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నాడు నాని. అందుకే తన నటించే సినిమాల్లో ప్రతి పాత్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు నాని.
2017లో నాని, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా, భూమిక ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ఎంసీఏ(MCA). ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఎంసీఏ సినిమాలో విలన్ గా విజయ్ వర్మ నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఎంసీఏ సినిమా సక్సెస్ లో విజయ్ వర్మకు కూడా భాగం ఉందని చెప్పవచ్చు. ఎంసీఏ సినిమా విడుదల అయినా సమయంలో విజయ్ వర్మ నటనతో అదరకొట్టాడనే వార్తలు జోరుగా విన్పించాయి.
దాంతో అసలు ఈ విజయ్ వర్మ ఎవరనే వెతుకులాట మొదలయ్యాయి. ఒక మార్వాడి కుటుంబంలో జన్మించిన విజయ్ వర్మ హైదరాబాద్ లోనే పెరిగాడు. పూణే ఇన్స్టిట్యూట్ లో నటనకు సంబంధించి కోర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ముంబైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసాడు. విజయ్ వర్మకు సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక ఉండటంతో ఒక డ్రామా కంపెనీలో చేరి నాటకాలు వేయటం ప్రారంభించాడు. అయితే విజయ్ వర్మ సినిమాల్లోకి రావటం ఇంటిలోవారికి ఇష్టం లేదట. దాంతో చాలా కాలం వరకు విజయ్ తో వారి కుటుంబసభ్యులు మాట్లాడలేదట.
ఎంసీఏ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన విజయ్ వర్మ బాలీవుడ్ లో పింక్, గల్లీ బాయ్, సూపర్ 30 లాంటి భారీ ప్రాజెక్టులో నటించి సక్సెస్ ని అందుకున్నాడు. ఎంసీఏ తరువాత విజయ్ వర్మ మరే తెలుగు సినిమాలో కనిపించలేదు. బాలీవుడ్ లో చేసిన సినిమాలు హిట్ కావటంతో విజయ్ వర్మ గురించి ఎంసీఏ నిర్మాతలకు తెలిసింది. దాంతో వెంటనే ఎంసీఏ నిర్మాతలు విలన్ గా విజయ్ వర్మను ఫిక్స్ చేసేసారు. సినిమాలో విజయ్ నానితో పోటాపోటీగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. విజయ్ నటనకు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యిపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…