Heroines : జీవితం మీద ఎన్నో ఆశలతో ఎవరైనా సరే వివాహం చేసుకుంటారు. ఈ క్రమంలోనే వారు ఎన్నో కలలు కంటుంటారు. అయితే కొందరికి మాత్రం జీవితం అనుకున్న విధంగా ఉండదు. ఎన్నో కష్టాలు వస్తుంటాయి. కొందరికి తమ జీవిత భాగస్వాములు దూరమవుతుంటారు. అయితే టాలీవుడ్ హీరోయిన్లకు అదేమైనా శాపమో.. మరో ఇతర కారణమో తెలియదు కానీ.. చాలా మంది హీరోయిన్లు తమ భర్తలను కోల్పోయారు. వయస్సు ఇంకా మీద పడక ముందే అనూహ్యంగా.. అనుకోకుండా కొందరు హీరోయిన్లకు చెందిన భర్తలు చనిపోయారు. వారు ఎవరు.. అనే వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
నటి జయసుధ అప్పట్లో వెండితెరపై ఒక వెలుగు వెలిగింది. ఈమె నితిన్ కపూర్‌ను వివాహం చేసుకుంది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2017లో ఈయన అనూహ్యంగా చనిపోయారు. అలాగే నటి సుమలత కూడా అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఈమె కన్నడ నటుడు అంబరీష్‌ను వివాహం చేసుకోగా.. ఈయన 2018లో చనిపోయారు. తాజాగా మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా కన్నుమూశారు.

ఇక నటి భానుప్రియ మంచి డ్యాన్సర్ గానే కాక నటిగా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె భర్త ఆదర్శ్ కౌశల్ 2005లో చనిపోయారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న రోహిణి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈమె భర్త రఘువరన్ 2008లో చనిపోయారు. సురేఖావాణి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె భర్త సురేష్ తేజ 2019లో చనిపోయారు. సీనియర్ నటి కవిత భర్త దశరథ 2021లో కరోనా కారణంగా చనిపోయారు. డిస్కోశాంతి భర్త శ్రీహరి అనారోగ్య సమస్యల వల్ల 2013లో చనిపోయారు. అలాగే మేఘనా రాజ్ తన భర్త, కన్నడ హీరో చిరంజీవి సర్జాను 2020లో కోల్పోయారు. ఇలా కొందరు హీరోయిన్లు మాత్రం జీవితంలో చాలా చేదు సంఘటనలను ఎదుర్కొన్నారు.